Numerology: ఈ తేదీల్లో పుట్టినవారికి బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?
సంఖ్యాశాస్త్రం ప్రకారం.. వ్యక్తి స్వభావం, లక్షణాలు, భవిష్యత్తును అంచనా వేయడానికి జన్మతేది ఆధారంగా మూలసంఖ్యను గణిస్తారు. జన్మతేది 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారికి మూలసంఖ్య 1 అవుతుంది. ఈ సంఖ్యకు అనుకూలమైన భాగస్వాములు ఎవరు..? సంబంధం ఎలా ఉంటుంది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సంఖ్యాశాస్త్రం ప్రకారం.. వ్యక్తి స్వభావం, లక్షణాలు, భవిష్యత్తు గురించి జన్మతేదీ ఆధారంగా గణించబడిన సంఖ్యల ద్వారా తెలుసుకోవచ్చు. జన్మతేదీలోని అంశాలను కలిపి వచ్చిన మొత్తం సంఖ్యను మూలసంఖ్య అని అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జన్మతేది 1, 10, 19, 28 వంటి తేదీలలో పుట్టిన వారి మూలసంఖ్య 1 అవుతుంది. ఈ మూలసంఖ్య ఆధారంగా వారి స్వభావం, భవిష్యత్తు గురించి అంచనాలు వేయవచ్చు. ఇప్పుడు మనం మూలసంఖ్య 1 వారికి బెస్ట్ పార్టనర్ ఏ సంఖ్యతో ఉంటుందో.. వారితో సంబంధం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
మూలసంఖ్య 1
సంఖ్యాశాస్త్రం ప్రకారం.. మూలసంఖ్య 1 ఉన్న వ్యక్తులు అదే మూలసంఖ్య 1 ఉన్నవారితో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. వీరు ఒకరికొకరు ఆదర్శవంతమైన భాగస్వాములుగా ఉంటారు. పరస్పర గౌరవం ఎక్కువగా ఉండటంతో వారి సంబంధం మరింత బలపడుతుంది.
మూలసంఖ్య 2
2, 11, 20 తేదీలలో జన్మించిన వారికి మూలసంఖ్య 2 వస్తుంది. వీరు మూలసంఖ్య 1 ఉన్న వారికి ఉత్తమ జీవన భాగస్వాములు అవుతారు. ఈ జంటలో ప్రేమాభిమానాలు సమతులంగా ఉంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకుని పరస్పరంగా సహాయపడుతారు. ముఖ్యంగా మూలసంఖ్య 2 వ్యక్తులు మూలసంఖ్య 1 వారిని వారి లక్ష్యాలను చేరుకోవడంలో ప్రోత్సహిస్తారు, మద్దతు ఇస్తారు.
మూలసంఖ్య 5
5, 14, 23 తేదీలలో జన్మించిన వారికి మూలసంఖ్య 5 వస్తుంది. వీరు మూలసంఖ్య 1 ఉన్నవారికి అనుకూలంగా ఉంటారు. ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించడం వల్ల ఈ జంట మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది. పరస్పర అవగాహన ఉండటంతో వీరి సంబంధం మరింత బలంగా, ఆనందంగా కొనసాగుతుంది.
మూలసంఖ్య 8
8, 17, 26 తేదీలలో జన్మించిన వారికి మూలసంఖ్య 8 వస్తుంది. వీరు మూలసంఖ్య 1 ఉన్నవారికి మంచి జీవిత భాగస్వాములు అవుతారు. ఈ జంట పరస్పరంగా బాగా అర్థం చేసుకుంటారు. ప్రేమ, విశ్వాసంతో కూడిన సంబంధం కొనసాగించేందుకు వీరు ప్రయత్నిస్తారు.