100 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక.. వీరికి పట్టిందల్లా బంగారమే ఇక!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఇవి ఎప్పుడూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తుంటాయి. అయితే ఈ సారి సూర్యగ్రహణం రోజు కొన్ని గ్రహాల కలియక జరగబోతుంది. దీంతో మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అసలు ఏ రాశుల వారికి గ్రహాల వలన కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.
Updated on: Mar 26, 2025 | 3:31 PM

దాదాపు వంద సంవత్సరాల తర్వాత మీన రాశిలోకి శని గ్రహం, కుజ గ్రహం, సూర్య, బుధ, చంద్ర గ్రహాలతో పాటు రాహు గ్రహాల కలియక జరగబోతుంది. దీని కారణంగా సప్తగ్రహి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం వలన మూడు రాశుల వారికి ఆర్థికంగా, ఆరోగ్య పరంగా, వృత్తి పరంగా కలిసి వస్తుంది. కాగా, ఆ రాశులు ఏవి అంటే?

మిథున రాశి : మిథున రాశి వారికి సప్తగ్రహి రాజయోగం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. వీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారు. ఆర్థికంగా కలిసివస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది.

మకరం : మక రాశి వారికి మీన రాశిలో గ్రహాల కలయిక వలన అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. ధన లాభం కలుగు తుంది. కోర్టు కేసులు వీరికి అనుకూలంగా వస్తాయి. ఇంటా బయట సంతోషక వాతావరణం ఏర్పడుతుంది. అడ్డంకులు తొలిగిపోతాయి.

మీన రాశి : మీన రాశి వారికి సప్తగ్రహి రాజయోగం ధనలాభం తీసుకొస్తుంది. ఈ రాశి వారికి ఈ రాజయోగం వలన అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులకు కలిసి వస్తుంది.

చేపట్టిన పనుల్లో విజయం వీరిసొంతం అవుతుంది. ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందుతారు. అనుకున్న పనులన్నీ పూర్తి కావడంతో సంతోషంగా గడుపుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.





























