April Bank Holidays: వినియోగదారులకు అలర్ట్.. ఏప్రిల్‌లో 13 రోజులు బ్యాంకులకు సెలవు!
April Bank Holidays: బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ మీరు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలను ఉపయోగించవచ్చు. ATM నుండి కూడా డబ్బు తీసుకోవచ్చు. కానీ బ్యాంకు సంబంధిత పనులు బ్రాంచ్‌కు వెళ్లి చేయలేరు. అందుకే ఏప్రిల్ నెలలో బ్యాంకు సెలవుల పూర్తి జాబితాను తెలుసుకుందాం..

ఏప్రిల్ నెల వచ్చేస్తోంది. దాంతో పాటు బ్యాంకులకు అనేక సెలవులు కూడా వస్తాయి. ఈ నెలలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు చాలా రోజులు మూసి ఉండనున్నాయి. మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఏప్రిల్ నెలలో బ్యాంకులకు ఏయే రోజులో సెలవు ఉంటుందో ముందస్తుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రతి నెల బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేస్తుంటుంది.
బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ మీరు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలను ఉపయోగించవచ్చు. ATM నుండి కూడా డబ్బు తీసుకోవచ్చు. కానీ బ్యాంకు సంబంధిత పనులు బ్రాంచ్‌కు వెళ్లి చేయలేరు. అందుకే ఏప్రిల్ నెలలో బ్యాంకు సెలవుల పూర్తి జాబితాను తెలుసుకుందాం.
ఏప్రిల్ 2025 లో బ్యాంకు సెలవుల జాబితా
- ఏప్రిల్ 1: వార్షిక ఇన్వెంటరీ కారణంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
- ఏప్రిల్ 6 (ఆదివారం): రామ నవమి సందర్భంగా బ్యాంకులకు సెలవు. (చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు, కార్యాలయాలు కూడా మూసి ఉంటాయి.)
- ఏప్రిల్ 10 (గురువారం): మహావీర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు.
- ఏప్రిల్ 12 (శనివారం): నెలలో రెండవ శనివారం కావడంతో బ్యాంకులకు సెలవు.
- ఏప్రిల్ 13 (ఆదివారం): వారపు సెలవు
- ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు.
- ఏప్రిల్ 15: బోహాగ్ బిహు కారణంగా అగర్తల, గౌహతి, ఇటానగర్, కోల్‌కతా, సిమ్లాలో బ్యాంకులు మూసి ఉంటాయి.
- ఏప్రిల్ 16: బోహాగ్ బిహు కారణంగా గౌహతిలో బ్యాంకులకు సెలవు.
- ఏప్రిల్ 18: గుడ్ ఫ్రైడే సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
- ఏప్రిల్ 21: గరియా పూజ సందర్భంగా అగర్తలాలో బ్యాంకులకు సెలవు.
- ఏప్రిల్ 26 (శనివారం): నెలలో నాల్గవ శనివారం కావడంతో బ్యాంకులు బంద్.
- ఏప్రిల్ 29: శ్రీ పరశురామ జయంతి సందర్భంగా బ్యాంకులు మూసి ఉంటాయి.
- ఏప్రిల్ 30: బసవ జయంతి సందర్భంగా బెంగళూరులో బ్యాంకులకు సెలవు.
గమనిక: ఈ సెలవులు దేశవ్యాప్తంగా ఉండకపోవచ్చు. సెలవులు నిర్దిష్ట రాష్ట్రాలు లేదా నగరాలకు మాత్రమే. అందువల్ల మీ నగరం లేదా రాష్ట్రం ప్రకారం సెలవుల గురించి సమాచారం పొందడం ముఖ్యం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి