Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆ ప్రాంతంలో శుభ్రం చేస్తుండగా ఏదో రాయి మాదిరిగా పారకు తగిలింది.. తవ్వి చూడగా..

పురాతన తవ్వకాలు జరుపుతున్నప్పుడు నిధి, నిక్షేపాలు బయటపడటం గురించి మనం వింటూనే ఉంటాం.. ఒకవేళ కూలీలకు ఆ నిధి దొరికితే పంపకాల్లో తేడా వచ్చి విషయం బయటకు పొక్కుతూ ఉంటుంది. అలానే కొన్నిసార్లు చారిత్రక నేపథ్యాన్ని వివరించే రకరకాల శిలలు, శాసనాలు సైతం బయటపడుతూ ఉంటాయి.

Viral: ఆ ప్రాంతంలో శుభ్రం చేస్తుండగా ఏదో రాయి మాదిరిగా పారకు తగిలింది.. తవ్వి చూడగా..
Road Cleaning (representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 26, 2025 | 5:35 PM

మధ్యప్రదేశ్‌లోని ఇందార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బగోరియా గ్రామంలో స్థానికంగా ఉన్న ఒక ప్రాంతాన్ని శుభ్రం చేస్తోన్న సమయంలో అద్భుతమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు భూమి కింద పాతిపెట్టిన పురాతన విగ్రహాన్ని కనుగొన్నారు. అది విష్ణువు విగ్రహంగా చెబుతున్నారు. ఆ విగ్రహాన్ని బయటకు తీసి.. శుభ్రం చేసి..  గ్రామ ఆలయంలో ప్రతిష్టించారు. దీంతో ఆ విగ్రహాన్ని దర్శించుకునేందుకు స్థానికులు తండోపతండాలుగా వస్తున్నారు.

గ్రామస్థులు రవి శర్మ.. భగీరథ శర్మ, దేవేంద్ర లోధి, చంద్రభాన్ లోధిలతో కలిసి.. ఓ ప్రాంతాన్ని శుభ్రం చేసే క్రమంలో భాగంగా నేలను తవ్వినప్పుడు, దాదాపు అర అడుగు పొడవున్న ఈ విగ్రహం కనిపించింది. దానిని గ్రామ పెద్దలు, పండితులకు చూపించగా దానిని విష్ణువు విగ్రహం అని తెలిపారు.

బగోరియా గ్రామంలో ఒక పురాతన కోట కూడా ఉంది. అది ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఈ దొరికిన విగ్రహం ఆ కోటకు సంబంధించి చారిత్రక నేపథ్యాన్ని వివరించే ఆస్కారం ఉందంటున్నారు. విగ్రహం ఏ కాలానికి సంబంధించి.. అది దేనితో చేసింది వంటి వివరాలను తెలుసుకునేందుకు పురావస్తు శాఖకు సమాచారం అందించారు.

విగ్రహం దొరికిన తర్వాత గ్రామంలో భక్తిభావంతో కూడిన వాతావరణం నెలకొంది. భక్తులు ఈ విగ్రహాన్ని దైవిక వరంలా భావించి పూజిస్తున్నారు. పురావస్తు శాఖ దర్యాప్తులో ఏ కొత్త విషయాలు బయటపడతాయో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Vishu Idol

Vishu Idol