Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంజీలాల్‌ సుమన్‌ ఇంటిపై కర్ణి సేన దాడి, వాహనాలు ధ్వంసం!

సమాజ్ వాదీ ఎంపీ రాంజీ లాల్ సుమన్ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. మార్చి 21న రాజ్యసభలో ఆయన రాణా సంఘాను దేశద్రోహిగా అభివర్ణించారు. ఈ ప్రకటన తర్వాత, ఆయనపై రాజ్‌పుత్ సమాజం ఆగ్రహంతో ఉంది. ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతోంది. ఈ క్రమంలోనే బుధవారం(మార్చి 26) నాడు, కర్ణి సేన కార్యకర్తలు ఆగ్రాలోని ఎంపీ రాంజీ లాల్ సుమన్ ఇంటిపై దాడి చేశారు.

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంజీలాల్‌ సుమన్‌ ఇంటిపై కర్ణి సేన దాడి, వాహనాలు ధ్వంసం!
SP MP Ramji Lal Suman
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 26, 2025 | 6:07 PM

ఉత్తరప్రదేశ్‌ లోని ఆగ్రాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాంజీలాల్‌ సుమన్‌ ఇంటిపై కర్ణి సేన కార్యకర్తలు దాడి చేశారు. ఇంటి ముందు ఉన్న కార్లను ధ్వంసం చేశారు. ఇంటి అద్దాలను పగలకొట్టారు. పార్లమెంటు సాక్షిగా రాజ్‌పుత్‌ రాజు రాణా సంఘాపై రాంజీలాల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కర్నిసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నిరసనకారులు అతని ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు.దీంతో పోలీసులకు, కర్ణి సేనకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో చాలా మంది పోలీసులు గాయపడ్డారు.

మార్చి 21న, రాంజీ లాల్ సుమన్ రాజ్యసభలో రాణా సంఘాను దేశద్రోహిగా అభివర్ణించారు. భారత ముస్లింలు బాబర్‌ను తమ ఆదర్శంగా భావించరని రామ్‌జీ లాల్ రాజ్యసభలో అన్నారు. ప్రవక్త మొహమ్మద్, సూఫీ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. కానీ బాబర్‌ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఇబ్రహీం లోడిని ఓడించడానికి బాబర్‌ను ఆహ్వానించింది రాణా సంఘా. కాబట్టి, ముస్లింలను బాబర్ వారసులు అని పిలిస్తే, హిందూ ద్రోహులు రాణా సంఘా వారసులై ఉండాలి. మనం బాబర్ ని విమర్శిస్తాం. కానీ రాణా సంఘాని ఎందుకు విమర్శించకూడదు? అంటూ రాజ్యసభలో రాంజీ లాల్ సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై కర్ణి సేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆరాధ్యదైవాన్ని అవమానించారని ఆరోపిస్తూ బుల్‌డోజర్లతో రాంజీలాల్‌ సుమన్‌ ఇంటి దగ్గరకు కర్నిసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. పలువురిని అరెస్ట్‌ చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా రాజ్‌పుత్ సమాజం రాజ్యసభ సభ్యులు రాంజీ లాల్ సుమన్‌పై ఆగ్రహం ఉంది. భోపాల్‌లోని ఎస్పీ కార్యాలయం వెలుపల రాజ్‌పుత్ సంస్థ ప్రదర్శన నిర్వహించింది. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, రాంజీ లాల్ సుమన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రాణా సంఘా గురించి పోస్టర్లు వేయడంపై మహాపంచాయతీ, ఎస్పీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పోలీసులు వారిని నివారించారు. వివాదం తీవ్రమైన తర్వాత, రాంజీ లాల్ సుమన్ మాట్లాడుతూ, తన ప్రకటన సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఉద్దేశం తనకు లేనప్పటికీ, తన ప్రకటన ప్రజలకు అలాంటి సందేశాన్ని అందించడం విచారకరమన్నారు. దీంతో తనకు బాధగా ఉందని, అన్ని కులాలు, తరగతులు, వర్గాలను పూర్తిగా గౌరవిస్తానన్నారు.

మరోవైపు, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రకటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. జిన్నాను కీర్తించే వారికి మాత్రమే చరిత్ర తెలుసా? బాబర్, ఔరంగజేబు, జిన్నాను కీర్తించే వ్యక్తులే వీరు. దీన్ని బట్టి, దేశం పట్ల, భారతదేశ వారసత్వం పట్ల, భారతదేశ మహానుభావుల పట్ల వారికి ఎలాంటి భావాలు ఉంటాయో ఊహించవచ్చన్నారు. వారు వెనక్కి తిరగడానికి ఎక్కువ సమయం పట్టదని సీఎం యోగి అన్నారు. ఈ ప్రజలకు మహారాణా ప్రతాప్, రాణా సంఘా, ఛత్రపతి శివాజీ మహారాజ్, గురు గోవింద్ సింగ్ గురించి ఏమి తెలుసు? ఔరంగజేబు, బాబర్‌లను పూజించే వారి నుండి, జిన్నాను తమ ఆదర్శంగా భావించే వారి నుండి ఇది ఆశించలేమన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..