AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కామ్రా వ్యాఖ్యలను సమర్ధించిన వాళ్ల దుకాణం త్వరలో బంద్‌: ఏక్‌నాథ్‌ షిండే

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో కునాల్‌ కామ్రాకు కష్టాలు రెట్టింపయ్యాయి. విచారణకు హాజరయ్యేందుకు వారం రోజుల సమయం కావాలన్న కామ్రా విజ్ఞప్తిని ముంబై పోలీసులు తోసిపుచ్చారు. తనపై ద్రోహి అన్న ముద్ర వేస్తున్న వాళ్లు సుప్రీంకోర్టు తీర్పును గుర్తుకు తెచ్చుకోవాలన్నారు షిండే.

కామ్రా వ్యాఖ్యలను సమర్ధించిన వాళ్ల దుకాణం త్వరలో బంద్‌: ఏక్‌నాథ్‌ షిండే
Kunal Kamra
Balaraju Goud
|

Updated on: Mar 26, 2025 | 8:25 PM

Share

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేపై వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారంలో కునాల్‌ కామ్రాకు కష్టాలు రెట్టింపయ్యాయి. విచారణకు హాజరయ్యేందుకు వారం రోజుల సమయం కావాలన్న కామ్రా విజ్ఞప్తిని ముంబై పోలీసులు తోసిపుచ్చారు. తనపై ద్రోహి అన్న ముద్ర వేస్తున్న వాళ్లు సుప్రీంకోర్టు తీర్పును గుర్తుకు తెచ్చుకోవాలన్నారు షిండే.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేపై గద్దార్‌ వ్యాఖ్యల వివాదంలో కమెడియన్‌ కునాల్‌ కామ్రాకు ముంబై పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. విచారణకు వెంటనే హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు వారం రోజుల గడువు కావాలని కునాల్‌ కామ్రా కోరారు. అయితే అందుకు పోలీసులు ఒప్పుకోలేదు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీలో కునాల్‌ కామ్రాకు వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్‌ దారెకర్‌.

పొలిటికల్‌ కామెడీ పేరుతో నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మహాయుతి కూటమి ఎమ్మెల్యేలు మండిపడ్డారు. షిండేపై వ్యాఖ్యల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కునాల్‌ కామ్రా ప్రకటించారు. ఈ వివాదంపై ఏక్‌నాథ్‌ షిండే మరోసారి స్పందించారు. అసలైన శివసేన ఎవరిదో సుప్రీంకోర్టు తీర్పులో తేలిపోయిందని , ప్రజా తీర్పు కూడా తనకే అనుకూలంగా వచ్చిందని అన్నారు. అయినప్పటికి ద్రోహి అని పిలవడం దారుణమన్నారు. కునాల్‌ కామ్రాను సమర్ధిస్తున్న ఉద్దవ్‌ వర్గం నేతలపై షిండే మండిపడ్డారు. త్వరలోనే పార్టీని మూసుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

కునాల్‌ కామ్రా లాంటి వ్యక్తులకు సుపారీ ఇచ్చి తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. మరోవైపు షిండేపై వ్యాఖ్యల తరువాత కునాల్‌ కామ్రాకు బెదిరింపులు ఎక్కువైనట్టు తెలుస్తోంది. ఒక్కరోజులో తనకు 500 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయని , చంపేస్తామని బెదిరిస్తున్నారని కునాల్‌ కామ్రా తెలిపారు.

ఇదిలావుంటే, కునాల్ వ్యాఖ్యలు, పేరడీ పాటపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. శివసేన (షిండే వర్గం) నాయకులు ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతలో, కునాల్ కు సంగీత సంస్థ టి సిరీస్ పెద్ద షాక్ ఇచ్చింది. T సిరీస్ కాపీరైట్ నోటుస్ జారీ చేసింది. దీంతో కునాల్ కొత్త పేరడీ పాట YouTubeలో కనిపించకుండా పోయింది. ‘భోలీ సి సూరత్ ఆంఖోన్ మే మస్తీ’ పాట కోసం టి-సిరీస్ కామ్రాకు నోటీసు పంపిందని చెబుతున్నారు. దీని తర్వాత కునాల్ అగ్రహం వ్యక్తం చేశారు. T సిరీస్ తోలుబొమ్మగా ఉండటం మానేయాలని సోషల్ మీడియా X లో పోస్ట్ చేశాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..