C-DAC: బీఈ/బీటెక్‌ అర్హతతో సీడ్యాక్‌లో ఉద్యోగావకాశాలు.. ఏడాది రూ.16 లక్షల జీతంపొందే అవకాశం..

కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన పట్నా, సిల్‌చర్‌, గువాహటిలలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌).. 19 మేనేజర్‌, ప్రిన్సిపల్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ తదితర..

C-DAC: బీఈ/బీటెక్‌ అర్హతతో సీడ్యాక్‌లో ఉద్యోగావకాశాలు.. ఏడాది రూ.16 లక్షల జీతంపొందే అవకాశం..
C-DAC Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 13, 2022 | 8:54 AM

కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నీలజీ మంత్రిత్వశాఖకు చెందిన పట్నా, సిల్‌చర్‌, గువాహటిలలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడ్యాక్‌).. 19 మేనేజర్‌, ప్రిన్సిపల్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ అడ్మిన్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌ తదితర పోస్టుల నియామకాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఎక్సాస్కేల్ కంప్యూటింగ్ మిషన్, మైక్రోప్రాసెసర్ అండ్‌ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ మిషన్, క్వాంటం కంప్యూటింగ్ మిషన్, ఏఐ అండ్‌ లాంగ్వేజ్ కంప్యూటింగ్ మిషన్, ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్, డిపెండబుల్ అండ్ సెక్యూర్ కంప్యూటింగ్ మిషన్, జెన్‌నెక్ట్స్‌ అప్లైడ్ కంప్యూటింగ్ మిషన్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎంసీఏ/ఎంబీఏ/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్ధుల వయసు 56 యేళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 27, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దరఖాస్తు సమయంలో రూ.500లు రిజిస్ట్రేషన్‌ ఫీజుగా చెల్లించాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారు ఏడాదికి రూ.16 లక్షల జీతంతో కొలువు సొంతం చేసుకోవచ్చు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు