AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maria Telkes: ఈ రోజు గూగుల్‌ డూడుల్‌ చూశారా? ఆమెను ‘ది సన్ క్వీన్‌’ అని ఎందుకు పిలుస్తారంటే

గూగుల్‌ డూడుల్‌లో ఉన్న ఈ మహిళా శాస్త్రవేత్త ఎవరో గుర్తు పట్టారా? నేడు ప్రపంచమంతా వినియోగిస్తున్న సోలార్ ఎనర్జీ సృష్టికర్త. అవును.. సౌరశక్తి పరిశోధనలకు తొలిసారిగా దారులు పరచిన మార్గదర్శి ఆమె..

Maria Telkes: ఈ రోజు గూగుల్‌ డూడుల్‌ చూశారా? ఆమెను ‘ది సన్ క్వీన్‌’ అని ఎందుకు పిలుస్తారంటే
Google Doodle Celebrates Life Maria Telkes
Srilakshmi C
|

Updated on: Dec 12, 2022 | 11:17 AM

Share

గూగుల్‌ డూడుల్‌లో ఉన్న ఈ మహిళా శాస్త్రవేత్త ఎవరో గుర్తు పట్టారా? నేడు ప్రపంచమంతా వినియోగిస్తున్న సోలార్ ఎనర్జీ సృష్టికర్త. అవును.. సౌరశక్తి పరిశోధనలకు తొలిసారిగా దారులు పరచిన మార్గదర్శి ఆమె. డాక్టర్‌ మారియా టెల్కేస్‌ గురించే మనం చర్చిస్తోంది. మారియా టెల్కేస్‌ 1952లో సరిగ్గా ఇదే రోజున సొసైటీ ఆఫ్‌ విమెన్‌ ఇంజనీర్స్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌ అందుకున్నారు. మారియా టెల్కేస్‌ సాధించిన ఈ ఘనతను గుర్తుచేసుకుంటూ సోమవారం (డిసెంబర్ 12) గూగుల్‌ సెలబ్రేషన్స్‌ చేస్తోంది. ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి కూడా మారియా టెల్కేస్‌ కావడం విశేషం.

ఎవరీ మారియా టెల్కేస్‌..?

మారియా టెల్కేస్‌ 1900లో హంగేరిలోని బుడాపెస్ట్‌లో జన్మించారు. ఆమె బుడాపెస్ట్‌లోని ఈట్వోస్ లోరాండ్ యూనివర్సిటీలో ఫిజికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌లో ఉన్నత విద్యనభ్యసించారు. ఇక్కడే 1920లో బీఏ,1924లో పీహెచ్‌డీ డిగ్రీలు పొందారు. ఆ తర్వాత ఆమె యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లి బయోఫిజిసిస్ట్‌గా స్థిరపడ్డారు. ఈక్రమంలో 1937లో అమెరికా పౌరసత్వం కూడా పొందారు.

ఇవి కూడా చదవండి

1948లో ఫిలాంథ్రోపెస్ట్‌ల నుంచి నిధులు సమకూరిన తర్వాత ఆర్కిటెక్ట్ ఎలియనోర్ రేమండ్‌తో కలిసి మొట్టమొదటి సారిగా ‘డోవర్ సన్ హౌస్‌’ను సృష్టించించారు. ఆమె కృషి ఫలితంగా సోలార్-హీటెడ్ హోమ్ ప్రయోగం విజయవంతమైంది. దీంతో నాటి నుంచి ‘సోలార్ ఎనర్జీ’ వెలుగులోకి వచ్చింది. డాక్టర్ టెల్కేస్‌ స్ఫూర్తిదాయక జీవితంమంతా విజయాలు, ఆవిష్కరణలతో నిండి పోయింది. ఫోర్డ్ ఫౌండేషన్ ద్వారా ఆమె ప్రయోగాలు వెలుగు చూడటం వల్ల సోలార్ ఓవెన్ డిజైన్‌ను రూపొందించడం సాధ్యపడిందని గూగుల్ తన కథనంలో తెలిపింది.

అంతేకాకుండా న్యూయర్క్‌ యూనివర్సిటీ, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, డెలావేర్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సోలార్‌ ఎనర్జీ (సౌరశక్తి) రీసెర్చ్‌లో టెల్కేస్‌ తన వంతు కృషిని అందించారు. టెల్కేస్‌ ఆవిష్కరించిన సోలార్‌ ఎనర్జీకి 20 కంటే ఎక్కువ పేటెంట్‌ హక్కులను పొందారు. అనేక ఎనర్జీ కంపెనీలకు సలహాదారుగా వ్యవహరించారు. ఇంతటి ఘనతను సాధించిన టెల్కేస్‌ను ‘ది సన్ క్వీన్‌’ గుర్తుంచుకోవడంలో ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని’ అని గూగుల్ తెలిపింది.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి.