AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus Jio 5G: రిలయన్స్‌ జియోకు వన్‌ప్లస్‌ సహకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో జియో ట్రూ 5జీ సేవలు

గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ వన్‌ప్లస్‌- రిలయన్స్‌ జియో కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో 5G మద్దతును అందించడానికి రిలయన్స్ జియోతో తన సహకారాన్ని ప్రకటించింది..

OnePlus Jio 5G: రిలయన్స్‌ జియోకు వన్‌ప్లస్‌ సహకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లలో జియో ట్రూ 5జీ సేవలు
Jio True 5g
Subhash Goud
|

Updated on: Dec 12, 2022 | 3:42 PM

Share

గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ వన్‌ప్లస్‌- రిలయన్స్‌ జియో కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో 5G మద్దతును అందించడానికి రిలయన్స్ జియోతో తన సహకారాన్ని ప్రకటించింది. భారతీయ వినియోగదారులకు 5G సాంకేతికతను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో అంతటా తమ 5జీ సాంకేతిక సేవలను విస్తరింపజేయడానికి రిలయన్స్‌ జియో , వన్‌ప్లస్‌ పని చేస్తున్నాయి. జియో5Gకి సపోర్ట్ చేసే వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు జియో ట్రూ 5G నెట్‌వర్క్‌కు యాక్సెస్ ఉన్న వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌లలో సరికొత్త వన్‌ప్లస్‌ 10 సిరీస్‌, వన్‌ప్లస్‌ 9ఆర్‌, వన్‌ప్లస్‌ 8 సిరీస్, నార్డ్‌, నార్డ్‌ 2టీ, నార్డ్‌ సీఈ2, నార్డ్‌ సీఈ2 Lite ఉన్నాయి. అదేవిధంగా వన్‌ప్లస్‌9 ప్రో, వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ ఆర్‌టీ కూడా త్వరలో జియో ట్రూ 5 జీ నెట్‌వర్క్‌కు యాక్సెస్‌ను కలిగి ఉంటాయి.

కంపెనీ వివరాల ప్రకారం.. డిసెంబర్‌ 13 నుంచి డిసెంబర్‌ 18 వరకు వన్‌ప్లస్ వార్షికోత్సవ సేల్‌ జరగనుంది. ఇందులో భాగంగా జియో ట్రూ 5జీ అందించే మొబైల్‌లలో అద్భుతమైన క్యాష్‌బ్యాక్‌ అందుకోవచ్చు. రూ.10,800 విలువైన క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలు అందుకోవచ్చు. మొదట 1000 మంది లబ్దిదారులు అదనంగా కాంప్లిమెంటరీ రెడ్‌ కేబుల్‌ కేర్‌ ప్లాన్‌ను అందుకోవచ్చు. వీటి విలువ రూ.1499, జియో సావన్‌ ప్రో రూ.399. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ లో జియో తన 5జీ ట్రయల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే.

భారత్‌లోని మా కమ్యూనిటీకి 5G టెక్నాలజీని తీసుకురావడానికి జియో బృందంతో భాగస్వామ్యం అయినందుకు గర్వంగా ఉందని, 5G టెక్నాలజీతో వినియోగదారులు వేగవంతమైన ఇంటర్నెట్‌ సదుపాయం అందుకోవచ్చని వన్‌ప్లస్‌ ఇండియా సీఈవో, ఇండియా రీజియన్ హెడ్ నవనిత్ నక్రా ఒక ప్రకటనలో తెలిపారు. వన్‌ప్లస్‌ మొబైళ్లు జియో ట్రూ5జి యాక్సెస్‌ వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9ఆర్‌టి కూడా త్వరలో జియో ట్రూ 5 జి నెట్‌వర్క్‌కు యాక్సెస్ కలిగి ఉంటాయని కంపెనీ తెలిపింది. అలాగే వన్‌ప్లస్ విభాగంలో భారతదేశంలో రూ. 20,000, రూ.30,000 ధరలలో5G స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి