AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Call Record: ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అలాంటి సౌండ్ వస్తోందా?.. మీ కాల్ ట్యాప్ చేయబడిందని అర్థం..

మీరు ఎవరితోనైనా మొబైల్‌లో మాట్లాడుతున్నప్పుడు మీకు ఇలాంటి వింత శబ్దం వినిపిస్తుందా..? మీ కాల్ రికార్డ్ చేయబడుతున్నట్లే.. అయితే మీరు మీ కాల్ రికార్డ్ చేయబడిందో లేదో తెలుసుకోవచ్చు.

Call Record: ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అలాంటి సౌండ్ వస్తోందా?.. మీ కాల్ ట్యాప్ చేయబడిందని అర్థం..
Call Record
Sanjay Kasula
|

Updated on: Dec 11, 2022 | 1:48 PM

Share

చాలా దేశాల్లో ఇతరుల కాల్స్‌ను రికార్డ్ చేయడం చట్టవిరుద్ధం. ఈ కారణంగా, గూగుల్ కొంతకాలం క్రితం థర్డ్ పార్టీ యాప్‌లను కూడా నిలిపివేసింది. అంటే థర్డ్ పార్టీ యాప్‌ల నుంచి కాల్ రికార్డింగ్ చేయలేం. దీని కోసం, ఫోన్‌లోనే ఇన్‌బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్ ఉంది. అయితే, మీరు ఇన్‌బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను ఆన్ చేస్తే.. ముందు ఉన్న వ్యక్తి దాని గురించి సమాచారాన్ని పొందుతాడు. చాలా సార్లు ఎదురుగా ఉన్న వ్యక్తి మీ కాల్‌ని రికార్డ్ చేస్తున్నాడనే విషం మీకు కూడా తెలియదు. కానీ అతను రికార్డు చేస్తున్న విషయాలన్ని గుర్తించబడవచ్చు. ఇందుకోసం మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాల్ రికార్డింగ్‌ను ఎలా నివారించవచ్చో మనం ఇక్కడ తెలుసుకుందాం..

కాల్ రికార్డింగ్ ఇలా..

మీ మొబైల్ ఫోన్ కాల్‌లు రికార్డ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేయడానికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో కొత్త ఫోన్‌లలో కాల్ రికార్డింగ్ అనౌన్స్‌మెంట్ చాలా తేలికగా వినబడుతుంది. కానీ పాత లేదా ఫీచర్ ఫోన్ నుంచి కాల్ రికార్డింగ్ చేస్తే, దానిలో ప్రకటన వినబడకపోవడం వల్ల సమస్య ఉంది. ఈ పరిస్థితిలో మీరు ఇతర పద్ధతులను అవలంబించవలసి వస్తుంది.

బీప్ శబ్దం వినిపిస్తే జాగ్రత్త..

మీరు కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు బీప్ శబ్దంపై శ్రద్ధ  పెట్టండి. సంభాషణ సమయంలో బీప్-బీప్ శబ్దం వస్తుంటే.. మీ కాల్ రికార్డ్ చేయబడిందని అర్థం చేసుకోండి. కాల్ అందుకున్న తర్వాత చాలా సేపు బీప్ శబ్దం వస్తే, మీ కాల్ రికార్డ్ అవుతుందని కూడా అర్థం చేసుకోండి.

ఆండ్రాయిడ్ వినియోగదారులు దీన్ని గుర్తుంచుకోవాలి 

ఈ రోజుల్లో మార్కెట్లోకి వస్తున్న కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌లు, ఆ వినియోగదారులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసినప్పుడు.. దాని గురించి మీరు ఇప్పటికే అప్రమత్తంగా ఉంటారు. దీని ద్వారా మీ కాల్ రికార్డ్ చేయబడిందని మీరు అర్థం చేసుకోవచ్చు.

కాల్ రికార్డింగ్, కాల్ ట్యాపింగ్ అంటే ఏంటి? 

చాలా మందికి కాల్ రికార్డింగ్, కాల్ ట్యాపింగ్ మధ్య తేడా తెలియదు. మూడవ వ్యక్తి మీ సంభాషణను రికార్డ్ చేస్తున్నప్పుడు, దానిని కాల్ ట్యాపింగ్ అంటారు. ఈ పని టెలికాం కంపెనీల ద్వారా కూడా చేయవచ్చు. కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత దర్యాప్తు సంస్థలు కాల్ ట్యాపింగ్ చేయవచ్చు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా కాల్ ట్యాపింగ్ కోసం వివిధ సాధనాలను ఉపయోగిస్తాయి. కాల్ ట్యాపింగ్ లో కాల్ చేసిన వారికి తెలియక పోయినా కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టారంటే కాల్ ట్యాప్ అవుతుందో లేదో అర్థం చేసుకోవచ్చు. తరచూ కాల్ డ్రాప్ అవుతున్నా, అది కాల్ ట్యాపింగ్ కు సంకేతంగా భావించవచ్చు కానీ, కేవలం కాల్ డ్రాప్ వల్ల కాల్ ట్యాప్ అవుతుందని చెప్పలేం.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం