Viral: హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.. రద్దీగా ఉండే అజ్మీర్ రోడ్డులో ఎల్‌పీజీ(LPG), సీఎన్‌జీ (CNG) ట్యాంకర్లు ఢీకొన్నాయి.. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి.. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. పదుల సంఖ్యలో వాహనాలు దగ్దమయ్యాయి..
రాజస్థాన్‌లోని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్ పెట్రోల్ పంపు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకన్న పోలీసులు. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎల్‌పిజి ట్యాంకర్, సిఎన్‌జి ట్రక్కు రెండూ ఢీకొన్నాయని, ఆ తర్వాత భారీ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. పరస్పరం ఢీకొన్న అనంతరం ఓ ట్యాంకర్ వాహనాలపైకి దూసుకెళ్లింది. పోలీసులు, ఫైర్ సిబ్బంది అధికారులు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. జైపూర్-అజ్మీర్ హైవే ప్రమాదంలో దాదాపు 24 మంది గాయపడినట్ట సమాచారం. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాదాపు 40 వాహనాలకు మంటలు అంటుకున్నాయని జైపూర్ డీఎం జితేంద్ర సోనీ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

