Pushpa 2 Effect: ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
పుష్ప.. ఎక్కడ చూసినా పుష్ప-2 గురించే చర్చ.. ఈ సినిమా క్రేజ్ మామూలుగా లేదు.. చిన్న పిల్లాడి దగ్గరి నుంచి పండు ముసలివాళ్ల వరకు తగ్గేదేలే అంటూ పుష్పరాజ్ పూనుతున్నాడు. సినిమా చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ పుష్ప గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా పుష్ప సినిమాలో హీరో ఒక సన్నివేశంలో గంగమ్మ దేవత వేషం కోసం చీర కూడా కట్టాడు. సినిమాలో ఈ ప్రత్యేకమైన సీన్ చాలా ఫేమస్ అయింది.
పుష్ప 2 సినిమాలో వచ్చే పాట, హీరో యాక్టింగ్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. ప్రస్తుతం ఈ గెటప్ దేశవ్యాప్తంగా అభిమానులను ఊర్రూతలూగిస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఆ గెటప్ వేసుకుని తమ అభిమాన హీరోలా మురిసిపోతున్నారు. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో ఓ యువకుడు పుష్పరాజ్ వేషంతో వీధుల్లో తిరుగుతూ హల్చల్ చేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ ఆల్ఫా-2లో ఓ యువకుడు అల్లు అర్జున్ గంగమ్మ వేషంతో వీధుల్లో తిరుగుతున్నాడు. చీర కట్టుకుని, అమ్మవారిలా అలంకరించుకుని అచ్చం సినిమాలో హీరోలా తయారయ్యి రీల్స్ చేస్తున్నాడు. రోడ్డు మీద తిరుగుతున్న ఆ యువకుడిని ఎవరైనా పలకరిస్తే.. తగ్గేదేలే అనే సిగ్నేచర్ మూమెంట్ చేస్తూ సమాధానమిస్తున్నాడు. గంగమ్మ వేషధారణలో ఉన్న ఆ యువకుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

