Diabetes: డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
భారతదేశంలో ప్రతి సంవత్సరం మధుమేహం కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య 10 కోట్లకు పైగా ఉంది. ఇప్పుడు చిన్న వయసులోనే మధుమేహం వస్తోంది. 30 నుంచి 40 ఏళ్లలోపు వారు కూడా టైప్-2 మధుమేహ బాధితులుగా మారుతున్నారు. అటువంటి పరిస్థితిలో దాని నుంచి నివారణ అవసరం.. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..
డయాబెటిస్.. ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా ఈ మహమ్మారి వ్యాప్తిచెందుతోంది.. భారతదేశంలో ప్రతి సంవత్సరం మధుమేహం కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.. దేశంలో 10 కోట్లకు పైగా ఈ వ్యాధి కేసులు నమోదయ్యాయని ICMR నివేదిక తెలియజేస్తోంది. గత కొన్నేళ్లుగా ఈ సంఖ్య మరింత పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ ప్రతి మూడో వ్యక్తికి మధుమేహం వస్తుందనే భయం ఉంది. 30 నుంచి 40 ఏళ్లలోపు వారు కూడా టైప్-2 మధుమేహ బాధితులుగా మారుతున్నారు. అటువంటి పరిస్థితిలో, దాని నుంచి నివారణ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
డయాబెటిస్ అనేది జీవితకాల ( దీర్ఘకాలిక ) వ్యాధి, దీనిలో రక్తంలో చక్కెర (గ్లూకోజ్) అధిక స్థాయిలో ఉంటుంది. మధుమేహం అత్యంత సాధారణ రూపం టైప్ 2 మధుమేహం.. అయితే.. తప్పుడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే, మధుమేహం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి..
మధుమేహం రెండు రకాలుగా ఉంటుందని ఢిల్లీలోని రాజీవ్ గాంధీ ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అజిత్ కుమార్ చెబుతున్నారు. ఒకటి చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల వచ్చేది టైప్-2.. మరొకటి జన్యుపరమైనమైనది అదే టైప్-1.
టైప్-1 పుట్టినప్పుడు సంభవించవచ్చు. అటువంటి పరిస్థితిలో, నివారణ అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ మీరు టైప్ -2 మధుమేహాన్ని నివారించవచ్చు. దీని కోసం కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం.. డైలీ ఈ రొటీన్ పాటిస్తే మధుమేహం నుంచి కాపాడుకోవచ్చని చెబుతున్నారు..
5 కిలోమీటర్ల చురుకైన నడక..
మధుమేహాన్ని నివారించడానికి, మీరు చురుకుగా ఉండటం ముఖ్యం. ఇందుకోసం రోజూ కనీసం 5 కిలోమీటర్లు వేగంగా నడవండి. అంటే, కాలినడకన నడవాలి.. కానీ కొంచెం వేగంగా ఉండాలి. అందులో నడుస్తున్నప్పుడు ఊపిరి పీల్చుకున్నట్లు అనిపిస్తుంది. బ్రిస్క్ వాక్ చేయడం వల్ల శరీరంలోని షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మెడికల్ జర్నల్ ది లాన్సెట్‌లో మధుమేహాన్ని నివారించడంలో చురుకైన నడక కూడా ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు.
యోగా చేయండి..
వేగంగా నడిచిన తర్వాత కనీసం అరగంట పాటు యోగా చేయాలి. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించే అనేక యోగా ఆసనాలు ఉన్నాయి. వీటిలో మార్జారీ ఆసనం, అర్ధకతిచక్రాసనం, కటిచక్రాసనం అత్యంత ప్రయోజనకరమైనవి. ఇటీవల, యోగా వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించి ఎయిమ్స్ పరిశోధన కూడా వచ్చింది. ఇందులో యోగా చేయడం ద్వారా మధుమేహాన్ని సులభంగా నివారించవచ్చని చెప్పారు.
మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి..
డయాబెటిస్‌ను నివారించడానికి లేదా రాకుండా ఉండటానికి మీ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆహారంలో తక్కువ కొవ్వు, పిండి పదార్థాలు, ఎక్కువ ప్రోటీన్లు ఉండాలి.. అంటే బంగాళాదుంపలు, పిండి, చక్కెర వంటి వాటిని తక్కువగా తీసుకోవాలి. ఖచ్చితంగా పప్పులు, కిడ్నీ బీన్స్, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలను ఆహారంలో చేర్చండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి