AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway Service: రైలు టిక్కెట్లపై ఈ 4 సదుపాయాలు ఉచితం.. అవేంటో తెలుసా?

Indian Railways: మన భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాను కల్పిస్తోంది. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండే రైల్వే.. ప్రయాణికుల కోసం ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. ఒక టికెట్‌పై వివిధ సదుపాయాలు ఉచితంగా పొందవచ్చనే విషయం మీకు తెలుసా..? మరి మీ టికెట్‌పై నాలుగు ఉచిత సర్వీసులను పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

Railway Service: రైలు టిక్కెట్లపై ఈ 4 సదుపాయాలు ఉచితం.. అవేంటో తెలుసా?
Subhash Goud
|

Updated on: Dec 23, 2024 | 3:48 PM

Share

రైలులో ప్రయాణించేటప్పుడు భారతీయ రైల్వే అనేక సౌకర్యాలను అందిస్తుంది. దీని గురించి చాలా మంది ప్రయాణికులకు తెలియదు. రైలు టిక్కెట్‌తో మీరు అనేక ఉచిత సౌకర్యాలను పొందవచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భారతీయ రైల్వే స్టేషన్‌లో ఆహారం నుండి ప్రయాణికుల కోసం ఏర్పాట్లు చేస్తుంది. అయితే వివిధ కేటగిరీల్లో ప్రయాణించే ప్రయాణికులు వివిధ రకాల సౌకర్యాలను పొందుతారు. ఈ సౌకర్యాల గురించి తెలుసుకుందాం.

ఉచిత బెడ్‌రోల్:

భారతీయ రైల్వేలోని AC 1, AC 2, AC 3 కోచ్‌లలో నిద్రించడానికి ప్రయాణికులకు ఉచిత బెడ్‌రోల్స్ అందించబడతాయి. ఇందులో దుప్పటి, దిండు, రెండు బెడ్‌షీట్లు, టవల్ ఉన్నాయి. అయితే గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో బెడ్‌రోల్ కోసం రూ.25 చెల్లించాలి. ఇది కాకుండా కొన్ని రైళ్లలో ప్రయాణికులు తమ డిమాండ్‌పై అదనపు ఛార్జీలు చెల్లించడం ద్వారా స్లీపర్ క్లాస్‌లో బెడ్‌రోల్ కూడా పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

ఉచిత వైద్య పరీక్ష

మీరు రైలులో ప్రయాణిస్తున్నప్పుడు అనారోగ్యానికి గురైతే రైల్వే మీకు ఉచితంగా ప్రథమ చికిత్స అందిస్తుంది రైల్వే. పరిస్థితి తీవ్రంగా ఉంటే తదుపరి చికిత్స కోసం కూడా ఏర్పాట్లు చేస్తుంది. వైద్య సదుపాయాల కోసం ప్రయాణికులు రైల్వే ఉద్యోగులు, టికెట్ కలెక్టర్, స్టేషన్ సూపరింటెండెంట్ మొదలైనవారిని సంప్రదించవచ్చు.

ఉచిత ఆహారం

మీరు రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణిస్తుంటే, మీ రైలు 2 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే, IRCTC మీకు ఉచిత ఆహారాన్ని అందిస్తుంది.

ఉచితంగా వేయిటింగ్‌ రూమ్‌

రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు తరచూ ప్లాట్‌ఫారమ్‌పై కూర్చుని కొన్నిసార్లు రైలు కోసం గంటల తరబడి వేచి ఉంటారు. అయితే స్టేషన్‌లో ప్రయాణికులకు వేచి ఉండే గదులు అందుబాటులో ఉన్నాయి. మీరు స్టేషన్‌లోని ఏసీ లేదా నాన్-ఏసీ వెయిటింగ్ హాల్‌లో సౌకర్యవంతంగా వేచి ఉండవచ్చు. దీని కోసం మీరు మీ రైలు టిక్కెట్‌ను చూపించాలి.

భారతీయ రైల్వేలోని ప్రధాన స్టేషన్లలో క్లోక్‌రూమ్‌లు, లాకర్ రూమ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రయాణికులు తమ లగేజీని సరైన పద్ధతిలో స్టోర్‌ చేసుకోవచ్చు. అయితే, ఈ సదుపాయాన్ని పొందేందుకు నిర్ణీత రుసుము చెల్లించాలి. అయితే రైలులో ప్రయాణించేటప్పుడు ఒక్కో రైలు, కోచ్‌ని బట్టి ఈ సౌకర్యాలు మారవచ్చు.

ఇది కూడా చదవండి: Aadhaar: మీ ఆధార్‌ను ఎవరైనా వినియోగిస్తే తెలుసుకోవడం ఎలా? లాక్‌ చేయండిలా!

Follow Us
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..
సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా?ఇలా చేశారంటే, ఖర్చు లేని స్పీడ్
సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా?ఇలా చేశారంటే, ఖర్చు లేని స్పీడ్
బేకరీ స్టైల్ పిజ్జా టోస్ట్.. ఓవెన్ లేకుండా పెనంపైనే ఇలా చేసేయండి
బేకరీ స్టైల్ పిజ్జా టోస్ట్.. ఓవెన్ లేకుండా పెనంపైనే ఇలా చేసేయండి
ప్రతి కుర్రాడిని ఏడిపించేసింది. చంచల పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
ప్రతి కుర్రాడిని ఏడిపించేసింది. చంచల పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్
ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్
పెద్ది‌తో పాన్ ఇండియా రికార్డుల వేటలో రామ్ చరణ్
పెద్ది‌తో పాన్ ఇండియా రికార్డుల వేటలో రామ్ చరణ్