AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాలికల హాస్టల్ సమీపాన అదో మాదిరి అలికిడి.. వెళ్లి చూడగా గుండె గుభేల్.!

సరీసృపాలు వెకేషన్‌లో ఉన్నట్టు ఉన్నాయి. తమ ఆవాసాలను విడిచిపెట్టి జనావాసాల్లోనే ఎక్కువగా కాలం గడుపుతున్నాయి. ఇదేంటబ్బా.! చిన్న పాములు అయితే ఊరుకొవచ్చు. ఏం భయం ఉండదు. అవి ఒక్కటే కాదు.. భారీ కొండచిలువలు, కింగ్ కోబ్రాలు సైతం జనావాసాల్లో దర్శనమిస్తున్నాయి. ఆ వివరాలు..

Viral Video: బాలికల హాస్టల్ సమీపాన అదో మాదిరి అలికిడి.. వెళ్లి చూడగా గుండె గుభేల్.!
Representative Image
Ravi Kiran
|

Updated on: Dec 23, 2024 | 4:02 PM

Share

సరీసృపాలు.. ఈ మధ్యకాలంలో అడవిని, టం ఆవాసాలను విడిచిపెట్టి.. తరచుగా జనావాసాల్లోకి వస్తున్నాయి. చిన్న చిన్న పాములైతే.. ఏమాత్రం భయం లేకుండా తీసేయొచ్చు. కానీ అక్కడక్కడ భారీ కొండచిలువలు, కింగ్ కోబ్రాలు దర్శనమిస్తుండటంతో జనాల గుండె గుభేల్ అంటోంది. ఇటీవల సిల్చార్‌లోని అస్సాం యూనివర్శిటీ బాలికల హాస్టల్ సమీపంలో ఒక భారీ కొండచిలువ దర్శనమిచ్చింది. అది సుమారు 100 కిలోల బరువు, 17 అడుగుల పొడవు ఉన్న బర్మీస్ పైథాన్‌గా అధికారులు గుర్తించారు. ఇక బాలికలు ఈ పైథాన్‌ను చూసి దెబ్బకు షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం ఘటనాస్థలానికి చేరుకోవడం.. పామును బంధించడంతో.. బాలికలు హమ్మయ్యా..! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన డిసెంబర్ 18వ తేదీ రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సిల్చార్‌లోని అస్సాం యూనివర్సిటీ బాలికల హాస్టల్ సమీపంలో చోటు చేసుకుంది. సుమారు 100 కిలోల బరువున్న పెద్ద కొండచిలువ అనుకోని అతిధిలా హాస్టల్ సమీపంలో దర్శనమిచ్చింది. అక్కడున్న కేర్ టేకర్.. అలాగే మరికొంతమంది బాలికలు దాన్ని చూడగా.. వెంటనే రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు, రెస్క్యూ సిబ్బంది సరైన సమయానికి ఘటనాస్థలికి చేరుకొని.. ఆ బర్మీస్ పైథాన్‌ను పట్టుకున్నారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కాగా, బరాక్ లోయ ప్రాంతాల్లో కనిపించే ఈ భారీ కొండచిలువలు.. మనుషులకు ఎలాంటి హాని కలిగించవు. ఈ బర్మీస్ కొండచిలువలు ఎక్కువగా చిన్న జంతువులను వేటాడతాయి. అలాగే మనుషులను ఎటాక్ చేయడం, హాని చేయడం, ఇబ్బంది పెట్టడం లాంటివి చేయవు.

ఇది చదవండి: ఏపీ విద్యార్ధులకు పండుగలాంటి వార్త.. ముందుగానే సంక్రాంతి వచ్చేసిందోచ్

Follow Us
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని