PV Sindhu: పీవీ సింధు భర్తకు ఆ టాప్ ఐపీఎల్‌ టీమ్‌తోనూ సంబంధాలు.. పూర్తి బ్యాక్ గ్రౌండ్ ఇదే

భారత బ్యాడ్మింటన్ క్వీన్ పీవీ సింధు తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. వెంకట దత్తసాయి అనే బిజినెస్ మెన్ తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిందీ హైదరాబాదీ స్టార్. ఆదివారం (డిసెంబర్ 22) రాత్రి రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్ లో సింధు వివాహం గ్రాండ్ గా జరిగింది.

PV Sindhu: పీవీ సింధు భర్తకు ఆ టాప్ ఐపీఎల్‌ టీమ్‌తోనూ సంబంధాలు.. పూర్తి బ్యాక్ గ్రౌండ్ ఇదే
PV Sindhu Wedding
Follow us
Basha Shek

|

Updated on: Dec 23, 2024 | 4:13 PM

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, ఒలింపియన్ పూసర్ల వెంకట సింధు పెళ్లిపీటలెక్కింది. వ్యాపార వేత్త వెంకట దత్తసాయితో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా ఆదివారం రాత్రి వీరి వివాహం అట్టహాసంగా జరిగింది. హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు. ఇక మంగళవారం(డిసెంబరు 24) సింధు- వెంకట దత్త సాయి వివాహ రిసెప్షన్‌ హైదరాబాద్ వేదికగా జరుగనుంది. కాగా పీవీ సింధు పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అదే సమయంలో పీవీ సింధు భర్త ఎవరన్నది తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. వెంకట దత్తసాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసుకునేందుకు గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో సింధూ భర్త గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే..

హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయి 2018లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఫ్లేమ్‌ యూనివర్సిటీ నుంచి బీబీఏ పట్టా అందుకున్నారు. అంతకంటే ముందే ఫౌండేషన్‌ ఆఫ్‌ లిబరల్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా కంప్లీట్ చేశారు. డిగ్రీ తర్వాత బెంగళూరులోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో డాటా సైన్స్‌ అండ్‌ మెషీన్‌ లెర్నింగ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు వెంకట దత్తసాయి.

ఇవి కూడా చదవండి

పీవీ సింధు పెళ్లి ఫొటో..

ఉన్నత చదువుల అనంతరం మల్టీ నేషనల్ కంపెనీ జిందాల్ సౌత్ వెస్ట్ లో కెరీర్ ప్రారంభించారు వెంకట దత్త సాయి. అక్కడ సమ్మర్‌ ఇంటర్న్‌గా, ఇన్‌హౌజ్‌గా కన్సల్టెంట్‌గా విధులు నిర్వర్తించారు. అక్కడే జేఎస్‌డబ్ల్యూ గ్రూపునకు చెందిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తోనూ ఆయన కలిసి పనిచేసినట్లు సమాచారం. ఇక వెంకట దత్తసాయి ప్రస్తుతం ‘పొసిడెక్స్‌ టెక్నాలజీస్‌’ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక సింధు- వెంకట దత్తసాయి కుటుంబాలకు ఇది వరకే పరిచయం ఉంది. ఇప్పుడది పెళ్లి బంధంగా మార్చుకున్నారు.

భర్తతో పీవీ సింధు..

View this post on Instagram

A post shared by PV Sindhu (@pvsindhu1)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!