ఏదేమైనా టీకి సాటి టీనే! ఉదయమైనా, సాయంత్రమైనా టీ తాగుతుంటే మనసుకి హాయిగా ఉంటుంది. అంతేకాదు, శరీరానికీ చాలా లాభాలున్నాయి. మెదడు చురుగ్గా పని చేయడంలో టీ కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి
TV9 Telugu
అందుకే ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో టీని ఇష్టపడేవారున్నారు. మన దేశంలో చాలా ఇళ్లలో ఉదయం కప్పు వేడి వేడి టీతోనే ప్రారంభమవుతుంది
TV9 Telugu
వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపుని తగ్గిస్తుంది. టీలోని యాంటీఆక్సిడెంట్లలో ఉండే పాలీఫినాల్స్ అందుకు కారణమట. టీలోని వివిధ రకాల మూలకాలవల్ల సృజనాత్మకత, సమస్యా పరిష్కార సామర్థ్యాలు పెరుగుతాయి
TV9 Telugu
టీలోని మూలకాలు బ్రెస్ట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిలువరిస్తాయి. అంతేకాదు ఇది పొట్టలోని భాగాలకు వచ్చే క్యాన్సర్లను తగ్గిస్తుంది. చర్మ సంబంధిత క్యాన్సర్‌లని నిరోధిస్తుంది
TV9 Telugu
రోజూ కనీసం మూడు కప్పులు టీ తాగే వాళ్లలో టైప్-2 మధుమేహం ముప్పు తగ్గుతుంది. ఇది ఇన్సులిన్ విడుదలకు సాయపడుతుంది. ఏదైనా అతి మంచిది కాదు. ఎల్లప్పుడూ దీనిని పరిమిత మోతాదులోనే తీసుకోవాలి
TV9 Telugu
మన దేశంలో కూడా అనేక రకరకాల టీలు పండిస్తారు. ఇవి విభిన్నమైన వాసన, రుచిని కలిగి ఉంటాయి. ఈ రుచులు టీ ప్రియులను అమితంగా ఆకర్షిస్తాయి
TV9 Telugu
అయితే టీ తాగేవారికి మరో శుభవార్త.. కామెల్లియా సినెన్సిస్ అనే ఇండియన్ టీ హెల్తీ డ్రింక్స్ విభాగంలో చేరింది. అమెరికాస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కామెల్లియా సినెన్సిస్ టీని ఆరోగ్యకరమైన పానీయంగా వర్గీకరించింది
TV9 Telugu
దీనితో తయారు చేసిన కప్పు టీలో ఐదు కంటే తక్కువ కేలరీలు ఉంటాయట. అందుకే ఇది ఆరోగ్య కేటగిరీలో చేరినట్లు FDA చెబుతోంది. మొక్కల ఆధారిత హెర్బల్ టీలన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయని FDA చెప్పింది