Healthy Liver Tips: పగటి పూట కునుకు తీస్తున్నారా? అయితే మీ లివర్‌కి డేంజర్‌ బెల్స్ మోగినట్లే..

మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు కునుకు తీయడం చాలా మందికి అలవాటు. 5- 10 నిమిషాల వరకు అయితే ఓకే. అయితే కొందరు గంటల తరబడి నిద్రపోతారు. ఇది లివర్ పై చెడు ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే మితిమీరిన కోపం కూడా యమ డేంజరట.. ఎందుకో తెలుసా..

Healthy Liver Tips: పగటి పూట కునుకు తీస్తున్నారా? అయితే మీ లివర్‌కి డేంజర్‌ బెల్స్ మోగినట్లే..
Healthy Liver
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 22, 2024 | 9:01 PM

కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. ఇది అనేక విభిన్న విధులను నిర్వహిస్తుంది. అందుకే కాలేయం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా ఇది శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది శరీరంలోని అనేక అవయవాలు సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. కానీ, మన రోజువారీ అలవాట్ల కారణంగా కాలేయానికి ప్రమాదం వాటిల్లుతుంది. ఆయిల్ ఫుడ్స్, ఆల్కహాల్ వంటి హానికరమైన పదార్థాలు కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే రెడ్ మీట్, సోడా, శీతల పానీయాలు, ఆల్కహాల్, ఆయిల్ ఫుడ్స్ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలిని అనుసరించడం కూడా కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఈ కింది 3 చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని నిపుణులు అంటున్నారు. అవేంటంటే..

పగటిపూట నిద్రపోవడం

కొంతమందికి పగటి పూట నిద్రించే చెడు అలవాటు ఉంటుంది. 10 నుంచి 20 నిమిషాల పాటు నిద్రపోవడం హానికరం కాదు.. కానీ పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది.

రాత్రి ఆలస్యంగా నిద్రించే అలవాటు

కొందరికి అర్థరాత్రి వరకు పని చేయడం లేదా లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం అలవాటు. అలాగే కొందరు టీవీ, ఫోన్ చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. దీని వల్ల చాలా ఆలస్యంగా నిద్రపోతాడు.. లివర్ ఆరోగ్యానికి ఇది మంచిది కాదు.

ఇవి కూడా చదవండి

మితిమీరిన కోపం

మన కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మన మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా ముఖ్యం. కాబట్టి, మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.