వాట్సాప్‎లో ChatGPT ఎలా పని చేస్తుందో తెలుసా?

TV9 Telugu

22 December 2024

ChatGPT సదుపాయాన్ని పొందడానికి వినియోగదారులు వాట్సాప్‎ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదంటే వెబ్ వెర్షన్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది.

వాట్సాప్ వినియోగదారులు కేవలం ఒక నంబర్‌ని డయల్ చేయడం ద్వారా ఓపెన్ AI ChatGPT ఫీచర్‌లను పొందగలుగుతారు.

ఓపెన్ AI సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో పోస్ట్ చేయడం జరగుతుంది. ChatGPT చాట్‌బాక్స్ విస్తరణ గురించి సమాచారాన్ని అందించింది.

అయితే, ఈ సదుపాయం ప్రస్తుతానికి అమెరికా, కెనడా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలో అన్ని దేశాలకు విస్తరణ జరగనుంది.

USలోని వినియోగదారులు కాల్‌లపై ChatGPTకి ఉచిత ప్రాప్యతను పొందుతారని ఓపెన్ AI తెలిపింది. ఉచిత యాక్సెస్ 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది.

ఇప్పుడు వినియోగదారులు 1-800-242-8478 ఫోన్ నంబర్‌కు సందేశం పంపడం ద్వారా వాట్సాప్‎ నుండి నేరుగా ChatGPTని యాక్సెస్ చేయవచ్చు.

అమెరికాలోని వాట్సాప్ వినియోగదారులు 1-800-ChatGPTకి కాల్ చేయడం ద్వారా ఈ చాట్‌బాట్‌ను యాక్సెస్ చేయవచ్చు.

ఈ ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలో పని చేయడం లేదు. అయితే దీనికి సంబంధించిన అప్‌డేట్ త్వరలో బయటకు రావచ్చని భావిస్తున్నారు.