AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 ఫోర్లు, 11 సిక్సర్లు.. ఏంది భయ్యా.. ఇంత వైల్డ్‌గా ఉన్నావ్ .. అలా దంచేశావ్..

Ruturaj Gaikwad: విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మహారాష్ట్ర, సర్వీసెస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ రెచ్చిపోయాడు. బౌలర్ ఎవరైనా సరే బాల్‌ని బౌండరీకి తరలించాడు. 74 బంతుల్లో 148 పరుగులు చేశాడు. రితురాజ్ గైక్వాడ్ తన ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 11 సిక్సర్లు బాదాడు. కేవలం 57 బంతుల్లో రుతురాజ్ సెంచరీ చేశాడు.

16 ఫోర్లు, 11 సిక్సర్లు.. ఏంది భయ్యా.. ఇంత వైల్డ్‌గా ఉన్నావ్ .. అలా దంచేశావ్..
Ruturaj Gaikwad
Velpula Bharath Rao
|

Updated on: Dec 23, 2024 | 6:25 PM

Share

భారత క్రికెట్‌లో లిస్ట్ ఏ ఫార్మాట్‌లో విజయ్ హజారే ట్రోఫీ అతిపెద్ద టోర్నమెంట్‌.. ఈ టోర్నీ ద్వారానే భారత వన్డే జట్టులో చోటు దక్కించుకుంటూ ఉంటారు. 38 జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీని క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. సోమవారం మహారాష్ట్ర, సర్వీసెస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్ అందరీని  అవ్కాకైయేలా చేసింది. ఈ ఇన్నింగ్స్‌ ఆడింది.. మహారాష్ట్ర జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఫోర్లు, సిక్సర్లతో విలయతాండవం చేశాడు. తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

రుతురాజ్ గైక్వాడ్ ఊచకోత..

ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బౌలర్లు అతని నిర్ణయం సరైనదని నిరూపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ జట్టు 48 ఓవర్లు మాత్రమే ఆడి 204 పరుగులకు ఆలౌటైంది. సర్వీసెస్ తరఫున కెప్టెన్ మోహిత్ అహ్లావత్ అత్యధికంగా 61 పరుగులు చేశాడు. అతను తప్ప మరే ఇతర బ్యాట్స్‌మెన్ కూడా 30 పరుగుల మార్కును దాటలేకపోయారు. మరోవైపు మహారాష్ట్ర జట్టులో ప్రదీప్ దాధే, సత్యజిత్ బచావ్ గరిష్టంగా 3-3 వికెట్లు తీశారు.

మహారాష్ట్ర జట్టుకు 205 పరుగుల లక్ష్యాన్ని సర్వీసెస్‌ ఇచ్చింది. కానీ రితురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ముందు చిన్నదిగా కనిపించింది.  ఓపెనింగ్ వచ్చిన రితురాజ్ గైక్వాడ్ చాలా వేగంగా పరుగులు చేశాడు. ప్రతి బౌలర్‌పై విరుచుకుపడ్డాడు. 74 బంతుల్లో 148 పరుగులు చేశాడు. రితురాజ్ గైక్వాడ్ తన ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 11 సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌లో 57 బంతుల్లో రితురాజ్ సెంచరీ చేయడం విశేషం. ఈ లక్ష్యాన్ని కేవలం 20.2 ఓవర్లలో చేధించారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి