Twitter Character Limit: ట్విట్టర్ యూజర్లకు గుడ్‌న్యూస్.. క్యారెక్టర్ లిమిట్ పెంచుతూ కీలక నిర్ణయం
ప్రపంచంలోని అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్లో క్యారెక్టర్ లిమిట్..
ప్రపంచంలోని అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్విట్టర్లో క్యారెక్టర్ లిమిట్ ఎత్తివేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్లాట్‌ఫామ్‌లో 280 అక్షరాల లిమిట్‌ను 4 వేల అక్షరాలకు పెంచనున్నట్లు ట్విట్టర్ సీఈవో మాస్క్ తెలిపారు. ఇటీవల యూజర్లు పదాల సంఖ్య పెంచాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ట్విట్టర్‌లో కేవలం 280లోపు అక్షరాలతో మాత్రమే ట్వీట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అక్షరాల సంఖ్య పెంచుతుంది. అయితే ట్విట్టర్‌ను మాస్క్ కొనుగోలు చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ లిమిట్ మారుతుందా అని చాలా మంది యూజర్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఓ యూజర్ ట్విట్టర్‌లో క్యారెక్టర్ లిమిట్‌ను తొలగిస్తారా? లేదా? కనీసం క్యారెక్టర్ల సంఖ్య పెంచండి అంటూ ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన మాస్క్ తప్పకుండా పెంచుతామని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో క్యారెక్టర్‌ల సంఖ్య పెంచుతున్నట్లు ట్విట్టర్ తెలిపింది.
#Twitter CEO #ElonMusk has confirmed that the micro-blogging platform will increase the tweet character limit from 280 to 4,000. pic.twitter.com/o4CDrUCN7o
— IANS (@ians_india) December 12, 2022
కాగా, మొదట్లో కేవలం రూ.140 క్యారెక్టర్స్ మాత్రమే ఉండేది. తర్వాత దానిని 280కి పెంచింది. అయితే యూజర్ల కోరిక మేరకు ట్విట్టర్ 2017 సెప్టెంబర్‌లో ఆ సంఖ్యను రెండింతలు చేసింది. మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉద్యోగుల తొలగింపుతో పాటు బ్లూ టిక్ వెరిఫికేషన్ వంటి నిర్ణయాలతో మస్క్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి