5G Technology: యూజర్లకు గుడ్ న్యూస్.. దేశంలో 50 నగరాలకు 5జీ సేవలు.. తక్కువ ధరకే అదిరిపోయే ప్లాన్స్
ఈ ఏడాది అక్టోబర్ నుంచి మన దేశంలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. అగ్రశ్రేణి టెలికాం ప్రొవైడర్లు అయిన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ రెండూ సంస్థలు 5జీ విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి.
దేశంలో 4జీ నెట్ వర్క్ వచ్చాక ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. దేశం దాదాపు డిజిటలీకరణ వైపు వేగంగా అడుగులు వేయడానికి ఇది చాలా ఉపకరించింది. ఇక ఇప్పుడు అందరి కళ్లు 5జీ పైనే ఉన్నాయి. అందుకనుగుణంగానే ఇటీవల 5జీ సేవలకు లాంఛనంగా ప్రారంభించారు. టెలికాం కంపెనీలు కూడా వినియోగదారులకు 5జీ అనుభూతి అందించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 నగరాల్లో ఇప్పటికే ఈ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి పార్లమెంట్లో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
అక్టోబర్ నుంచే..
ఈ ఏడాది అక్టోబర్ నుంచి మన దేశంలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. అగ్రశ్రేణి టెలికాం ప్రొవైడర్లు అయిన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ రెండూ సంస్థలు 5జీ విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. దీని తర్వాత వీఐ(వోడాఫోన్ ఇండియా) ఉంది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ రెండూ కలపి దేశంలో ఇప్పటికే 50 ప్రధాన నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ మేరకు పార్లమెంటరీ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. దేశంలో ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు(టీఎస్పీలు)5జీ సేవలకు అందించడం ప్రారంభించాయన్నారు. నవంబర్ 26వ తేదీ నాటికి దేశంలోని 50 పట్టణాల్లో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాయని చెప్పారు. 5జీ సేవలపై ఎటువంటి అదనపు చార్జీలు ఉండవని ఆయన వివరించారు.
5జీ అందుబాటులో ఉన్న 50 నగరాలు ఇవే..
- నోయిడా
- ఢిల్లీ
- గ్రేటర్ నోయిడా
- సిలిగురి
- గురుగ్రామ్
- బెంగళూరు
- హైదరాబాద్
- వారణాసి
- ముంబై
- నాగ్ పూర్
- చెన్నై
- పానిపట్
- గౌహతి
- పాట్నా
- ఫరీదాబాద్
- కోల్ కతా
- నాథద్వారా
- పూణే
- గుజరాత్‌లోని మొత్తం 33 జిల్లాల ప్రధాన కార్యాలయాలు
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..