Nellore Arogya Mitra Jobs: నెల్లూరు జిల్లా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో ఉద్యోగాలు.. అకడమిక్ మెరిట్ ఆధారంగా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్.. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 15 ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్.. ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 15 ఆరోగ్య మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు బీఎస్సీ/ ఎంఎస్సీ(నర్సింగ్) లేదా బీఫార్మసీ/ డీఫార్మసీ లేదా బీఎస్సీ(ఎంఎల్‌టీ) లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 65 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 14, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించాలి. దరఖాస్తు చేసే సమయంలో రూ.800లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. విద్యార్హతలు/కంప్యూటర్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
District Co-Ordinator, Dr YSR Arogyasri, Govt Hospital, Dargamitta, Nellore, AP.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.