AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: భార్య హత్య కేసులో భర్తకు 18 నెలల జైలు శిక్ష.. ఆరేళ్ల తర్వాత బతికొచ్చిన భార్యను చూసి షాక్‌!

ఆరేళ్ల క్రితం భార్యను హత్య చేసిన నేరం కింద భర్త 18 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. అతనితోపాటు అతని స్నేహితుడు కూడా ఈ నేరంలో శిక్ష పడింది. సరిగ్గ ఆరేళ్ల తర్వాత బతికున్న భార్యను రెండో భర్తతో చూసి..

Crime News: భార్య హత్య కేసులో భర్తకు 18 నెలల జైలు శిక్ష.. ఆరేళ్ల తర్వాత బతికొచ్చిన భార్యను చూసి షాక్‌!
Uttar Pradesh Crime News
Srilakshmi C
|

Updated on: Dec 12, 2022 | 12:45 PM

Share

ఆరేళ్ల క్రితం భార్యను హత్య చేసిన నేరం కింద భర్త 18 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. అతనితోపాటు అతని స్నేహితుడు కూడా ఈ నేరంలో శిక్ష పడింది. సరిగ్గ ఆరేళ్ల తర్వాత బతికున్న భార్యను రెండో భర్తతో చూసి ఖంగుతిన్నాడు పతి దేవుడు. అచ్చం సినీ ఫఖ్కిలో ఉన్న ఈ వింత ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మధుర SWAT టీమ్, సైబర్ సెల్ ఇన్‌ఛార్జ్ అధికారి అజయ్ కౌశల్ తెలిపిన వివరాల ప్రకారం..

రాజస్థాన్‌లోని కరౌలీ, దౌసా జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న మెహందీపూర్ బాలాజీ ఆలయానికి ఆర్తీ దేవి (26), ఆమె తండ్రి సూరజ్ ప్రకాష్ గుప్తాతో కలిసి దైవ వెళ్లారు. అక్కడే సోనూ సైనీ (32) అనే వ్యక్తి ఆర్తీ దేవికి పరిచయం ఏర్పడింది. 2015లో ఆర్తి తండ్రికి తెలియకుండా సోనూ సైనీ కోర్టు వివాహం చేసుకుంది. యూపీలోని బృందావన్‌ కాలనీలో అద్దె ఇంట్లో కాపురం ఉంటున్న క్రమంలో ఆర్తీ 2015లో హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఐతే ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని చూపి, ఆర్తీని తన అల్లుడు, అతని స్నేహితుడు కలిసి హత్య చేసినట్లు పోలీస్‌ స్టేషన్‌లో 2016లో కేసు పెట్టాడు. నిందితులను పట్టించిన వారికి రూ.15 వేల రివార్డు కూడా పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత సోను సైసీతోపాటు అతని స్నేహితుడైన గోపాల్‌ సైనీ (30)ని కూడా పోలీసులు హత్యా నేరం కింద అరెస్టు చేశారు. సోను సైసీ 18 నెలలు, గోపాల్‌ సైనీ 9 నెలలు జైలు శిక్ష అనుభవించారు. తర్వాత వీరికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు ఆరేళ్ల తర్వాత చనిపోయిందనుకుంటున్న ఆర్తి బతికేఉండటాన్ని సోను, గోపాల్‌ గుర్తించారు. అనంతరం మదుర పోలీసులకు ఈ నెల ప్రారంభంలో సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం (డిసెంబర్‌ 11) సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. రెండు వేర్వేరు పుట్టిన తేదీలు ఉన్న రెండు ఆధార్ కార్డులు ఆమె వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు అజయ్‌ కౌశల్‌ తెలిపారు. నిందితురాలైన ఆర్తీ దేవిని విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని మీడియాకు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

తాజా క్రైం వార్తల కోసం క్లిక్ చేయండి.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు