Udayanidhi Stalin: ఉదయనిధికి మంత్రి పదవి.. త్వరలోనే కేబినెట్ లోకి ఎంట్రీ.. రంగం సిద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి..
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ కుమారుడు, డీఎంకే ఎమ్మెల్యే.. ఉదయ నిధి స్టాలిన్ త్వరలోనే మంత్రి పదవిని చేపట్టనున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఇప్పటికే ఏర్పాటు చేస్తోంది. దీంతో కేబినెట్...
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ కుమారుడు, డీఎంకే ఎమ్మెల్యే.. ఉదయ నిధి స్టాలిన్ త్వరలోనే మంత్రి పదవిని చేపట్టనున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానం ఇప్పటికే ఏర్పాటు చేస్తోంది. దీంతో కేబినెట్ లో మార్పులు చేసేందుకు స్టాలిన్ సర్కార్ సిద్ధమైంది. కొద్ది నెలలుగా మంత్రులందరూ.. ఉదయనిధిని మంత్రివర్గంలో తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా ఉదయనిధిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు స్టాలిన్ సిద్ధమైనట్లు సమాచారం. సచివాలయంలో ఆయన కోసం ఓ ప్రత్యేక గదిని ఏర్పాటు చేసేందుకు పనులు వేగవంతమయ్యాయి. సచివాలయం పదో నెంబర్ ప్రవేశద్వారం సమీపంలో ఛాంబర్‌ను ఉదయనిధి కోసం అధికారులు సిద్ధం చేస్తున్నారు. రెండో అంతస్థులోని ఓ విశాలమైన గదిని కూడా ఆయన కోసం రెడీ చేస్తు్న్నారు. అయితే.. మినిస్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ వీటిలో ఏదో ఒక గదిని తన అధికారిక కార్యక్రమాల కోసం ఉపయోగించుకోనున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో ఉదయనిధి తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాత కరుణానిధికి అసలైన వారసుడిగా నిరూపించుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తండ్రికి కుడి భుజంగా ఉండి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఉదయనిధి స్టాలిన్ కు ఇప్పుడు 46 సంవత్సరాలు. 2019లో యువజన విభాగం కార్యదర్శిగా నియమితులయ్యాడు. ఉదయనిధి స్టాలిన్ రాజకీయ రంగంలోనే కాకుండా సినీ రంగంలో కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
మరోవైపు.. ఉదయనిధి స్టాలిన్ కు పార్టీ ఎమ్మెల్యేల నుంచి మంచి సపోర్ట్ అందుతోంది. అతనిని మంత్రి చేయాలంటూ సీఎం స్టాలిన్ కు కోరుతున్నారంటే.. ఈ యువ నాయకుడి పట్ల వారు చూపుతున్న ఆదరాభిమానాలు ఎలాంటివనేవి అర్థమవుతోంది. 1989 నుంచి డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారీ పార్టీ యువజన విభాగంలో ఒక్కరికైనా మంత్రి పదవి దక్కుతోంది. అయితే.. ఈసారి యువజన విభాగం నుంచి మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో ఉదయనిధి స్టాలిన్‌కు మంత్రి పదవి ఇవ్వడమే సరైందని అందరూ అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.