RCB Faridabad: రాత పరీక్షలేకుండా నెలకు రూ.2 లక్షల జీతంతో కొలువులు.. ఈ అర్హతలుంటే చాలు..

కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఫరీదాబాద్‌లోని రీజినల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ.. 25 చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ తదితర..

RCB Faridabad: రాత పరీక్షలేకుండా నెలకు రూ.2 లక్షల జీతంతో కొలువులు.. ఈ అర్హతలుంటే చాలు..
RCB Faridabad
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 13, 2022 | 8:28 AM

కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ఫరీదాబాద్‌లోని రీజినల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ.. 25 చీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ఎగ్జిక్యూటివ్‌, వెబ్‌సైట్‌ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్‌ అనలిస్ట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఆయా పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/బీటెక్‌/బీకామ్‌/బీఎస్సీ/బీబీఏ/ఎల్‌ఎల్‌బీ/ఎంసీఏ/ఎంటెక్‌/మాస్టర్స్‌ డిగ్రీ/డాక్టోరల్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో నోటిఫికేషన్లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. వయసు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 23, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే సమయంలో జనరల్ కేటగిరి రూ.1000లు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించనక్కరలేదు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.31,000ల నుంచి రూ.2 లక్షల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.