AIIMS Mangalagiri Jobs: రూ.67,000లకు పైగా జీతంతో ఎయిమ్స్‌ మంగళగిరిలో సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మంగళగిరికు చెందిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. వివిధ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల..

AIIMS Mangalagiri Jobs: రూ.67,000లకు పైగా జీతంతో ఎయిమ్స్‌ మంగళగిరిలో సీనియర్‌ రెసిడెంట్ పోస్టులు.. ఇంటర్వ్యూ ఎప్పుడంటే..
AIIMS Mangalagiri
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 13, 2022 | 9:12 AM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మంగళగిరికు చెందిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, న్యూరాలజీ, ఆప్తమాలజీ, పిడియాట్రిక్స్‌, ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహబిలిటేషన్‌, ట్రామా ఎమర్జెన్సీ విభాగాల్లో సీనియర్‌ రెసిడెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌/మెడిసిన్‌/సీడియాట్రిక్స్/ఆప్తమాలజీ/ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహబిలిటేషన్‌ లేదా తత్సమాన స్పెషలైజేషన్లో ఎంబీ/డీఎన్బీ/సర్జరీలో ఎమ్‌ఎస్‌/ఎమ్‌సీహెచ్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 యేళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు డిసెంబర్‌ 29, 2022వ తేదీన ఉదయం 8 గంటల 30 నిముషాలకు సంబంధిత డాక్యుమెంట్లతో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.800లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల నుంచి రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

Admin and Library Building, AIIMS Mangalagiri, Mangalagiri, Guntur District, Andhra Pradesh.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.