దారుణం.. భార్య, నలుగురు బిడ్డలను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి.. ఆ తర్వాత..

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్య, నలుగురు చిన్నారులను దారుణంగా నరికి చంపాడు. వారందరినీ హత్య తర్వాత తను ఆత్మహత్య చేసుకున్నాడు.

దారుణం.. భార్య, నలుగురు బిడ్డలను గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి.. ఆ తర్వాత..
Crime
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 13, 2022 | 12:14 PM

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్య, నలుగురు చిన్నారులను దారుణంగా నరికి చంపాడు. వారందరినీ హత్య తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి పరిస్థితి విషమంంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారికి చికిత్స అందుతుందని అధికారులు తెలిపారు. తిరువణ్ణామలై జిల్లా కలసప్పక్కం పక్కనే ఓరంతవాడి గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పళనిస్వామి – వల్లీ అనే దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు, ఓ అబ్బాయి సంతానం. కొన్ని రోజుల నుంచి పళనిస్వామి – వల్లీ మధ్య వివాదం జరుగుతోంది. భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలతో భర్త పళనిస్వామి భార్య, నలుగురు పిల్లలను గొడ్డలితో హతమార్చి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

ఈ క్రమంలో నిన్న రాత్రి ఎప్పటిలాగానే ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా పళనిచ్చామి, వల్లి మధ్య గొడవజరిగింది. ఈ క్రమంలో నిందితుడు ఆవేశంతో భార్య, ముగ్గురు అమ్మాయిలు, అబ్బాయిని గొడ్డలితో హతమార్చాడు. ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ చిన్నారి తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరువణ్ణామలై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్