E-Shram Card: ఒక్క కార్డుతో లక్షలాది రూపాయల ప్రయోజనం.. ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి..

దేశంలోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సామాజికంగా, ఆర్ధికంగా భద్రత కల్పించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇ-శ్రమ్ యోజనను ప్రారంభించింది.

E-Shram Card: ఒక్క కార్డుతో లక్షలాది రూపాయల ప్రయోజనం.. ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి..
E Shram Card
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 12, 2022 | 1:16 PM

దేశంలోని అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సామాజికంగా, ఆర్ధికంగా భద్రత కల్పించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇ-శ్రమ్ యోజనను ప్రారంభించింది. ఇ-శ్రమ్ యోజనను 2021 ఆగస్టు 26న ప్రధాని మోడీ ప్రారంభించారు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఇ-శ్రమ్ లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రణాళిక కింద ప్రభుత్వం కార్మికులకు పలు ప్రయోజనాలతోపాటు నగదు సహాయం కూడా అందిస్తుంది. ఈ పథకం కింద కార్మికుల కుటుంబాలకు బీమా పరిహారం అదనంగా అందిస్తారు. లబ్ధిదారుడు తప్పనిసరిగా ఇ-శ్రమ్ యోజన (ఇ-శ్రమ్ పోర్టల్ రిజిస్ట్రేషన్)ని ఉపయోగించే ముందు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కార్మికులతో పాటు, చిరు వ్యాపారులు, సాధారణ నివాసితులు, యువకులు, తక్కువ ఆదాయ కుటుంబాలకు చెందిన వారు ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకోని లబ్ధి పొందవచ్చు.

E- S hram కార్డ్ అర్హత ప్రమాణాలు..

16 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల వారు ఇ-శ్రమ్ పథకం కింద నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత నమోదు చేసుకున్న వారికి 12 అంకెల ప్రత్యేక నంబర్ (UAN) లభిస్తుంది. ఇ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసిన తర్వాత ప్రతి అసంఘటిత కార్మికుడికి అందించిన 12-అంకెల శాశ్వత ప్రత్యేక సంఖ్యను పరిగణలోకి తీసుకుని ప్రయోజనాన్ని అందిస్తారు.

ఇవి కూడా చదవండి

రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాలు..

  • ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్
  • సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వివరాలు
  • విద్యా ప్రమాణపత్రం
  • ఆక్యుపేషనల్ సర్టిఫికేట్
  • ఆదాయ ధృవీకరణ పత్రం
  • పాస్‌పోర్ట్ సైజు ఫొటో

E-Shram కార్డ్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

  • E-Shram పోర్టల్ (eshram.gov.in) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, ‘ఇ-శ్రమ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోండి’పై క్లిక్ చేయండి.
  • మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
  • మీరు EPFO/ESICలో సభ్యులా కాదా అని ఎంచుకోండి (అవును/కాదు)
  • ‘గెట్ OTP’పై క్లిక్ చేయండి.
  • OTPని నమోదు చేసిన తర్వాత, E-Shram కోసం రిజిస్ట్రేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  • మీ ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి, నిబంధనలు, షరతులతో ఏకీభవించడానికి బాక్స్‌పై క్లిక్ చేసి కొనసాగండి..
  • మీ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేసి, OTPని ధృవీకరించడానికి దానిపై క్లిక్ చేయండి.
  • ముందుగా నింపిన ఫారమ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీ వివరాలను ధృవీకరించండి. మళ్లీ కొనసాగించడానికి క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ ఫారమ్ ప్రివ్యూ/స్వీయ-డిక్లరేషన్ కనిపిస్తుంది.
  • మొత్తం సమాచారం సరిగ్గా ఉంటే అన్ని వివరాలను ధృవీకరించండి. కొనసాగడానికి డిక్లరేషన్ బాక్స్‌పై ఎంటర్ చేయండి
  • మీ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని నమోదు చేసి, ధృవీకరించడానికి దానిపై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు కనిపిస్తుంది
  • UAN కార్డ్ మీ స్క్రీన్‌పై జనరేట్ అవుతుంది.
  • UAN కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

ఇ-శ్రమ్ కార్డ్ ప్రయోజనాలు

  • ఇ-శ్రమ్ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ, ఇతర మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలోని పలు పథకాల కింద ప్రయోజనం చేకూరుస్తుంది.
  • E-Shram కార్డ్ కలిగి ఉన్న వ్యక్తి ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద 2 లక్షల ప్రమాద బీమాకు అర్హులు.
  • ఇ-శ్రమ్ పోర్టల్ అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న వ్యక్తులకు కేంద్ర పథకాలు లభించేలా చేస్తుంది.
  • ఈ పథకం కింద ఇచ్చిన అన్ని సామాజిక భద్రతా ప్రయోజనాలు ఈ పోర్టల్ ద్వారా అసంఘటిత కార్మికులకు నేరుగా అందుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!