తెలంగాణ AMVI పోస్టులకు నోటిఫికేషన్‌ ఇంకెప్పుడో? వయసుమించి పోతుందని నిరుద్యోగుల ఆందోళన

తెలంగాణ‌ అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (AMVI) పోస్టుల భర్తీపై ఇంకా స్పష్టత రాలేదు. రవాణాశాఖ ముందుకు కదలకపోవడంపై అభ్యర్ధులు ఆందోళన..

తెలంగాణ AMVI పోస్టులకు నోటిఫికేషన్‌ ఇంకెప్పుడో? వయసుమించి పోతుందని నిరుద్యోగుల ఆందోళన
Tspsc Amvi Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 14, 2022 | 9:39 AM

తెలంగాణ‌ అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (AMVI) పోస్టుల భర్తీపై ఇంకా స్పష్టత రాలేదు. 113 ఏమ్‌వీఐ పోస్టులకు 5 నెలల క్రితం ఉద్యోగ ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. వీటిల్లో 41 పోస్టులు మహిళలకు కేటాయించారు. మహిళలకు హెవీమోటారు వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు ఉండాలనే నిబంధనను ముందుగా చెప్పకుండా మార్చారని, లైసెన్స్‌ విషయంలో అభ్యర్ధుల్లో సందిగ్ధత నెలకొనడంతో వెంటనే సెప్టెంబర్‌లో నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. 2015లో అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు ఈ నిబంధన లేదు. అప్పట్లో మహిళా అభ్యర్థులు లైట్‌మోటారు వాహన లైసెన్సు కలిగి ఉండాలని, ఐతే సర్వీసులో చేరిన రెండేళ్లలోగా హెవీ మోటారు వాహన లైసెన్సు సాధించాలని నిబంధన పెట్టింది. ఈ సారి మాత్రం నేరుగా హెవీమోటారు వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్సు అడగటం ఏంటని కమిషన్‌ను ప్రశ్నించారు. దీంతో మహిళా అభ్యర్థుల సందేహాలపై స్పష్టత ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ కోరినప్పటికీ.. ఇప్పటివరకు రవాణాశాఖలో కదలిక లేదు.

నాలుగేళ్ల నుంచి ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మెకానికల్‌ ఇంజినీరు ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడా అని ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు కాలంగడిచే కొద్దీ కొందరికి గరిష్ఠ వయోపరిమితి దాటిపోతోందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరుతూ సోమవారం (డిసెంబ‌రు 12) టీఎస్‌పీఎస్సీ కమిషన్‌కు ఉద్యోగార్ధులు వినతి పత్రం సమర్పించారు. గత 4 నెలలుగా టీఎస్‌పీఎస్సీ, రవాణాశాఖ అధికారులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐతే అధికారులు మాత్రం రవాణాశాఖ సవరణ ప్రతిపాదనలు వస్తేగానీ ప్రకటన వెలువరించలేమని అధికారులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!