సెంట్రల్‌ వర్సిటీ, ఐఐటీ, ఐఐఎంలలో 11 వేలకుపైగా ఫ్యాకల్టీ పోస్టులు: మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

దేశంలోని సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఐఐటీ, ఐఐఎంలలో 11,000లకు పైగా ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు..

సెంట్రల్‌ వర్సిటీ, ఐఐటీ, ఐఐఎంలలో 11 వేలకుపైగా ఫ్యాకల్టీ పోస్టులు: మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
Minister Dharmendra Pradhan
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 14, 2022 | 10:02 AM

దేశంలోని సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఐఐటీ, ఐఐఎంలలో 11,000లకు పైగా ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లిఖితపూర్వక సమాధానంలో ఈ మేరకు తెలిపారు. దేశంలో మొత్తం 45 సెంట్రల్‌ యూనివర్సిటీ ఉండగా.. వీటిల్లో 18,956 పోస్టులు మంజూరు చేశారు. మంజూరైన పోస్టుల్లో 6,480 ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి తెలిపారు.

ఇక 23 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో 11,170 పోస్టులు మంజూరు కాగా వీటిల్లో 4,502 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా దేశంలో ఉన్న మొత్తం 20 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐటీలు)లలో 1,566 ఫ్యాకల్టీ పోస్టుల్లో 493 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా విద్యాసంస్థల్లో ఎస్సీ కేటగిరీలో 961 పోస్టులు, 578 ఎస్సీ పోస్టులు, 1657 ఓబీసీ పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 643, పీడ్బ్యూడీలో 301 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. వాటిని భర్తీ చేయడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం ఏర్పాటైన ఈ సంస్థల్లో నియామక ప్రక్రియ యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతుందని తెలిపారు. ఉద్యోగ ఖాళీలను మిషన్ మోడ్‌లో ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని అన్ని ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించినట్టు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.