AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: టార్గెట్ ఫిక్స్ చేసుకున్న వైఎస్ షర్మిల.. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ..

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఎన్నికల రణ క్షేత్రాన్ని ఫిక్స్ చేసుకున్నారు. తాను పోటీ చేయబోయే ప్లేస్‌ను డిసైడ్ చేశారు. తాను పాలేరు నుంచే పోటీ చేస్తున్నట్లు సూచనప్రాయంగా ప్రకటించారు వైఎస్ షర్మిల.

YS Sharmila: టార్గెట్ ఫిక్స్ చేసుకున్న వైఎస్ షర్మిల.. వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ..
Ys Sharmila
Shiva Prajapati
|

Updated on: Dec 14, 2022 | 1:02 PM

Share

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఎన్నికల రణ క్షేత్రాన్ని ఫిక్స్ చేసుకున్నారు. తాను పోటీ చేయబోయే ప్లేస్‌ను డిసైడ్ చేశారు. తాను పాలేరు నుంచే పోటీ చేస్తున్నట్లు సూచనప్రాయంగా ప్రకటించారు వైఎస్ షర్మిల. పాలేరు నియోజవర్గంపై ఫోకస్ పెడ్తున్నానని, ఈనె 16వ తేదీన అక్కడ కార్యాలయానికి భూమి పూజ చేస్తామని ప్రకటించారు. త్వరలోనే పాలేరుపై కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించారు షర్మిల. అన్ని నియోజకవర్గాలపై ఫోకస్ ఉంటుంది కానీ, పాలేరు బరిలో తాను ఉంటానని ప్రకటించారు. త్వరలోనే పాలేరులో జరగబోయే కార్యక్రాలపై కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల.. తన పాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇవ్వడంపై స్పందించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.

తాను పాదయాత్ర చేసుకోవచ్చని కేసీఆర్ సర్కార్ కు మొట్టికాయలు వేసినట్లు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు అని వ్యాఖ్యానించారు వైఎస్ షర్మిల. తన పాదయాత్రను అడ్డుకునేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తన పాదయాత్రలో టీఆర్ఎస్ గుండాలు తమపై దాడులు చేస్తున్నారని అన్నారు. దీక్ష ముగిసిన తరువాత కూడా తనను ఇంట్లోనుంచి అడుగుబయట పెట్టనివ్వడం లేదని ఆరోపించారు షర్మిల. పోలీసులకు కేసీఆర్ ఆదేశాలు ఇస్తూ.. తనను టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారామె. పోలీసులను పార్టీ కార్యకర్తలాగా కేసీఆర్ వాడుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీస్ శాఖపై కేసు వేయాలని తాము నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎలాంటి కారణం లేకుండానే పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు షర్మిల. తన హక్కులకు భంగం కలిగిస్తున్నారని పోలీసులపై కేసు వేస్తానని తెలిపారు షర్మిల.

పాదయాత్రకు బ్రేక్..

15 రోజులుగా వైఎస్సార్ టిపి ఆఫీస్ కు కార్యకర్తలను రానివ్వడం లేదని పోలీసులపై ఫైర్ అయ్యారు షర్మిల. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమను అష్టదిగ్బంధనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయ వ్యవస్థలపై తమకు నమ్మకం ఉందన్న ఆమె.. ఇప్పటికైనా కేసీఆర్ తమ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి తరువాత ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో అక్కడి ఉంచే మళ్ళీ మొదలు పెడతామని ప్రకటించారు షర్మిల. వైద్యుల సూచనల మేరకు మూడు వారాలు పాదయాత్రకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారామె.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..