Telangana Congress: తెలంగాణ ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు.. అడ్డగించిన పోలీసులు.. పలువురు నేతల అరెస్ట్
కాంగ్రెస్ వార్ రూం పై పోలీసుల దాడికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. గాంధీ భవన్ నుంచి ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు బయలు దేరారు. గేటు వద్ద బారికేడ్లను పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో..

కాంగ్రెస్ వార్ రూం పై పోలీసుల దాడికి నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. గాంధీ భవన్ నుంచి ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు బయలు దేరారు. గేటు వద్ద బారికేడ్లను పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టక ముందే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వార్ రూంపై పోలీసుల దాడి నేపథ్యంలో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
తన ప్రకటనలో ఆయన ‘‘అధికారం ఉంది కదా అని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టనుసారంగా కొందరు పోలీస్ అధికారులతో ప్రజాస్వామ్యాన్ని భయబ్రాంతులకు గురి చేస్తుంది. మీరు అధికారం కోల్పోయిన రోజు ఇలాంటి పరిస్థితే మీకు వస్తే.. ఆ రోజు మీరు ఏ మొఖం పెట్టుకొని మాట్లాడగలుగుతారు..? ప్రజాస్వామ్య పద్ధతిలోనే కాంగ్రెస్ పార్టీ ఉద్యమలు, న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నాలను తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కొంతమంది పోలీస్ అధికారులకు కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిక’’ అని జగ్గారెడ్డి తెలిపారు.
మరోవైపు నిజమాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాన్ని యువజన కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. కార్యాలయంలోకి చొచ్చుకోల్లే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ గేట్లకు కాంగ్రెస్ జెండాలను కట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సునీల్ కనుగోల్ వార్ రూమ్ సీజ్ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ నాయకులు కొందరు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి



