AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: నేడు అహ్మదాబాద్‌లో ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది వేడుకలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. నెల రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు..

గుజరాత్‌  అహ్మదాబాద్‌లో బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు జరిగే ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవ్ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్‌లోని స్వామి నగర్‌లో ఈ వేడుకలు..

PM Modi: నేడు అహ్మదాబాద్‌లో ప్రముఖ్ స్వామి మహారాజ్ శతాబ్ది వేడుకలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. నెల రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు..
Pm Modi Tributes Pramukh Swamy
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 14, 2022 | 1:23 PM

Share

గుజరాత్‌  అహ్మదాబాద్‌లో బుధవారం సాయంత్రం ఐదున్నర గంటలకు జరిగే ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవ్ కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్‌లోని స్వామి నగర్‌లో ఈ శతాబ్ది ఉత్సవాలు డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు జరుగుతాయి. భగవాన్ స్వామినారాయణ శాఖలోని ప్రముఖ సన్యాసి స్వామి మహరాజ్ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఈ వేడుక కోసం ఏడాది కాలం నుంచే సన్నాహాలు జరుగుతున్నాయి.  BAPS (బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ) ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల కోసం 80,000 మంది వాలంటీర్లుగా పనిచేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోదీతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కూడా పాల్గొంటారు.

వేడుకలకు 60 లక్షల మంది:

ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది మహోత్సవ్ వేడుకలను BAPS నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా అహ్మదాబాద్‌లోని రింగ్‌రోడ్డుపై ఓ భారీ సెట్టింగ్‌తో ‘స్వామి నగర్’ అనే నగరాని ఆ సంస్థ నిర్మించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 60 లక్షల మంది పాల్గొంటారని అంచనా. ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుండి స్వామినారాయణ వర్గానికి చెందిన ప్రజలు గుజరాత్‌కు చేరుకుంటున్నారు. శతాబ్ది ఉత్సవాల్లో 21 దేశాలకు చెందిన వీఐపీలు కూడా పాల్గొనున్నారు.

ఇవి కూడా చదవండి

స్వామి మహరాజ్ జ్ఞాపకార్థం ఉత్సవం:

ప్రముఖ్ స్వామి మహరాజ్ భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకమైన ప్రజల జీవితాలను ప్రేరేపించిన మార్గదర్శి ఇంకా గురువు. గొప్ప ఆధ్యాత్మిక నాయకుడిగా విస్తృతంగా గౌరవం పొందిన ఆయన తన జీవితాన్ని మానవాళి సేవకు అంకితమిచ్చారు. ఇక ఆయన లెక్కలేనన్ని సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేరేపించడమే కాక లక్షలాది మందికి సంక్షేమాన్ని, సంరక్షణను అందించారు.

నెల రోజుల పాటు జరగనున్న వేడుకలు:

ప్రముఖ్ స్వామి మహారాజ్ జన్మ శతాబ్ది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. BAPS గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్ షాహీబాగ్‌లోని స్వామినారాయణ్ మందిర్‌లో నిర్వహించే ‘ప్రముఖ్ స్వామి మహరాజ్ శతాబ్ది ఉత్సవం’తో ఏడాదిపాటు జరిగే ప్రపంచవ్యాప్త వేడుకలు ముగుస్తాయి. ఇక ఇవి అహ్మదాబాద్‌లో డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు రోజువారీ ఈవెంట్‌లు, నేపథ్య ప్రదర్శనలతో నెల రోజుల పాటు జరుగుతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..