Viral Video: తల్లి కోడి పొత్తికడుపు కింద ఆశ్రయం పొందిన కుక్క పిల్లలు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

రెండు కుక్క పిల్లలను కోడి తన పొట్ట కింద పెట్టుకుని వెచ్చదనాన్ని ఇస్తోంది. కుక్కలకు కోడి కనిపిస్తే దానిని చంపి తినే వరకూ ఆగలేవు. అలాంటిది రెండు కుక్క పిల్లలకు ఒక కోడి ఆశ్రయం కల్పించడమా..? అని ఆశ్చర్యపోతున్నారా..? కానీ

Viral Video: తల్లి కోడి పొత్తికడుపు కింద ఆశ్రయం పొందిన కుక్క పిల్లలు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Confused Chicken With Puppy
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 14, 2022 | 9:18 AM

ప్రస్తుతం నెట్టింట అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందుకు ప్రధాన కారణం ఆ వీడియోలలో కంటెంట్ ‌మీద మనకు ఎంతో కొంత అయినా అభిరుచి, ఆసక్తి ఉండడమే. సహజంగానే కుక్కలు లేదా కుక్కపిల్లలను మానవుడు ఎంతో ఇష్టపడుతుంటాడు. అందుకే అవి మానవ ప్రపంచానికి అత్యంత విశ్వాస పాత్రంగా ఉంటాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్న వీడియో పెంపుడు కుక్కల విశ్వాసానికి సంబంధించినది కాదు. రెండు కుక్క పిల్లల పెంపుడు తల్లికి సంబంధించినది. అవును ఓ కుక్క పిల్లను కోడి పిల్లల తల్లి తన పొట్ట కింద పెట్టుకుని వెచ్చదనాన్ని ఇస్తోంది. కుక్కలకు కోడి కనిపిస్తే దానిని చంపి తినే వరకూ ఆగలేవు. అలాంటిది రెండు కుక్క పిల్లలకు ఒక కోడి ఆశ్రయం కల్పించడమా..? అని ఆశ్చర్యపోతున్నారా..? కానీ నమ్మక తప్పదు. దానికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో ఒక కోడి తన పిల్లలతో పాటు రెండు కుక్క పిల్లలను తన పొత్తి కడుపు కింద పెట్టుకుని వెచ్చపరుస్తూ ఉంటుంది. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన మరో కోడి (తండ్రి కోడి) తన సహచరి కింద నుంచి బయటకు వస్తున్న కుక్కపిల్లలను చూసి ఆశ్చర్యపోతుంది. వీళ్ళు మన పిల్లలా..? అని తన సహచరిని ప్రశ్నించే విధంగా చూస్తుంది.  హృదయాన్ని కదిలించేలా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు ఇప్పటికే దాదాపు 6 లక్షల మందికి పైగా వీక్షించారు. చాలా మంది నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

‘ఇది ఎలా సాధ్యం?’ అని ఓ నెటిజెన్ కామెంట్ చేయగా, మరొకరు ‘ నేను ఇంత వరకు ఇలాంటి వీడియో చూడలేదు. చాలా బాగుంది. మనసును కరింగేంచిసింది ఇది’ అని రాసుకొచ్చాడు. ఇలా నెటిజన్లు కొందరు తమ తమ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..