AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN 1st Test: నేటి నుంచి ప్రారంభంకానున్న బంగ్లా-భారత్ తొలి టెస్ట్ సమరం.. మ్యాచ్ వివరాలివే..

అనూహ్యం రీతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా టెస్టు సిరీస్‌లో రెచ్చిపోవాలన్న పట్టుదలగా ఉంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నేటి నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో..

IND vs BAN 1st Test: నేటి నుంచి ప్రారంభంకానున్న బంగ్లా-భారత్ తొలి టెస్ట్ సమరం.. మ్యాచ్ వివరాలివే..
Ind Vs Ban 1st Test
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 14, 2022 | 6:48 AM

Share

అనూహ్యం రీతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా టెస్టు సిరీస్‌లో రెచ్చిపోవాలన్న పట్టుదలగా ఉంది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య నేడు(డిసెంబర్ 14) ఉదయం 9 గంటలకు తొలి టెస్టు ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలో నిలవాలనే పట్టుదల మీద భారత్ ఉండగా.. వన్డే సిరీస్‌ను నెగ్గిన బంగ్లాదేశ్ టీమిండియాకు గట్టి పోటీ ఇవ్వాలనే ఉద్దేశంలో ఉంది. బొటనవేలి గాయంతో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమవడంతో తాత్కాలిక కెప్టెన్‌గా రాహుల్ వ్యవహరించనున్నాడు. ఇంకా తొలి మ్యాచ్‌కు వైస్ కెప్టెన్‌గా చతేశ్వర్ పుజారా వ్యవహరించనున్నాడు. వన్డే, టి20ల్లో బంగ్లాదేశ్ సంచలన ప్రదర్శనలు చేసినప్పటికీ.. టెస్టుల్లో మాత్రం ఇంకా పసికూనే కావడంతో ఈ మ్యాచ్ లో భారత్ గెలుపు ఖాయమనే చెప్పవచ్చు. అయితే భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు గాయాలతో టెస్టు సిరీస్‌కు దూరం కాగా.. బొటన వేలి గాయంతో రోహిత్ తొలి టెస్టులో ఆడటం లేదు. రోహిత్ స్థానంలో తొలి టెస్టు కోసం అభిమన్యు ఈశ్వరన్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

అయితే అభిమన్యు ఈశ్వరన్‌కు తొలి టెస్టు ఆడే అవకాశం దక్కడం కష్టంగానే ఉంది. ఓపెనర్లుగా శుబ్ మన్ గిల్, కేఎల్ రాహుల్ లు ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత పుజారా, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లతో మిడిలార్డర్ బలంగా ఉంది. ఇక వికెట్ కీపర్ గా పంత్‌ను తీసుకుంటారా? లేక తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్‌కు అవకాశం ఇస్తారా అనేది చూడాలి. తొలి టెస్టులో భరత్ ఆడితే మాత్రం పంత్‌పై వేటు పడ్డట్లే లెక్క. ఈ మ్యాచ్‌లో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉంది. అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లుగా.. సిరాజ్, ఉమేశ్ యాదవ్ పేసర్లుగా ఆడే అవకాశం ఉంది. మరోవైపు బంగ్లాతో జరిగిన వన్డే సిరీస్‌లోని చివరి వన్డేలో అద్భుత సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ కూడా ఈ టెస్ట్‌లో కీలకంగా ఆడగలరని అభిమానులు విశ్వసిస్తున్నారు.

చటోగ్రామ్  పిచ్ రిపోర్ట్

ఇవి కూడా చదవండి

జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు అత్యంత అనుకూలమైనదన్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి,  కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ప్లేయర్లకు ఈ పిచ్‌‌పై సునాయాసంగా పరుగులు చేయగలరు. స్పిన్‌కు కూడా ఈ పిచ్ అనుకూలంగా ఉన్న నేపథ్యంలో భారత స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ కీలకం కానున్నారు.

వాతావరణ నివేదిక

చటోగ్రామ్ వాతావరణ నివేదికల ప్రకారం నేడు ప్రారంభం  కాబోయే తొలి మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం 2 శాతం మాత్రమే ఉంది. పరిస్థితులు క్రికెట్‌కు అనుకూలంగా ఉండడమే కాక వారం మొత్తం వాతావరణం స్పష్టంగా ఉంటుంది. .

భారత టెస్టు జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ , మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు, నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.

బంగ్లాదేశ్ జట్టు: షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), మహ్మదుల్లా, లిటన్ దాస్, ఖలీద్ అహ్మద్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, నూరుల్ హసన్, ఇబాత్ హుస్సేన్, మోమినుల్ హక్, మెహందీ హసన్ మీర్జా, షరీఫుల్ ఇస్లాం, యాసిర్ అలీ, తైజుల్ ఇస్లాం, జకీర్ హసన్, ముష్ఫిక్ హసన్, తస్కిన్ అహ్మద్, రెహ్మాన్ రజా, అనాముల్ హక్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..