- Telugu News Photo Gallery Cricket photos India vs Bangladesh 1st Test Here's all you need to know about When and Where to Watch
IND vs BAN 1st Test: బుధవారం జరగబోయే తొలి టెస్ట్ మ్యాచ్ పూర్తి వివరాలివే..
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత్ వన్డే సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లోనే ఓడి సిరీస్‌ను చేజార్చుకున్న టీమిండియా.. చివరి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. వన్డే సిరీస్‌ను కోల్పోయినా టెస్ట్ సిరీస్‌ను అయినా తన సొంతం చేసుకోవాలనే పట్టుదలతో భారత్ సిద్ధంగా ఉంది. మరి భారత్-బంగ్లా తొలి టెస్టు ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది..? ఎలా చూడాలి..? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Updated on: Dec 13, 2022 | 1:57 PM

చిట్టగాంగ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి గ్రౌండ్ వేదికగా డిసెంబర్ 14 నుంచి 18 వరకు భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.మ్యాచ్‌కు కేవలం ఒక్క రోజే మిగిలి ఉండడంతో ఇప్పటికే చిట్టగాంగ్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు తమ కూడా ప్రాక్టీస్ ప్రారంభించారు

భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా 8:30 గంటలకు టాస్ వేస్తారు. దీనికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు.

రెండో వన్డేలో గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ మూడో వన్డేకు దూరమయ్యాడు. అదే క్రమంలో చికిత్స కోసం ముంబైకి తిరిగి వచ్చిన రోహిత్ వైద్యుల సూచనల మేరకు మొదటి టెస్టుకు దూరంగా ఉండనున్నాడు.

అందుకే తొలి టెస్టుకు రోహిత్‌కు బదులుగా అభిమన్యు ఈశ్వరన్‌ను జట్టులోకి తీసుకున్నారు. అంతేకాకుండా గాయం కారణంగా బంగ్లాకు దూరంగా ఉన్న మహ్మద్ షమీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందువల్ల వారికి బదులుగా నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ జట్టులోకి వచ్చారు.

టీమ్ ఇండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, అభిమన్యు ఈశ్వా, అభిమన్యు ఈశ్వా ., సౌరభ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్.

బంగ్లాదేశ్ జట్టు: మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హసన్ శాంటో, మోమినుల్ హక్, యాసిర్ అలీ చౌదరి, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిటెన్ దాస్, నూరుల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, తస్కిన్ అహ్మద్, సయ్యద్, ఖలీద్ అహ్మద్ ఇస్లాం, జాకీర్ హసన్, రెజౌర్ రెహమాన్ రాజా, అనముల్ హక్ బిజోయ్.