- Telugu News Photo Gallery Cricket photos From gold bat to aluminum bat these 4 controversial bats in cricket history check here
వామ్మో వీళ్లేం బ్యాటర్స్ రా బాబు.. వింత బ్యాట్లతో వివాదాలకు ఆజ్యం.. లిస్టులో స్టార్ ప్లేయర్స్, ఐపీఎల్ ఇష్యూ కూడా..
Controversial Bats: క్రికెట్ చరిత్రలో చాలా సార్లు ఆటగాడి బ్యాట్ విషయంలో గొడవలు జరిగాయి. క్రికెట్ చరిత్రలో బ్యాట్‌కు, వివాదాలకు మధ్య లోతైన సంబంధం ఉంది. అలాంటి బ్యాట్ వివాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Dec 13, 2022 | 11:02 AM

Controversial Bats in Cricket: క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌లు రకరకాల బ్యాట్‌లను ఉపయోగించడం మనం తరచుగా చూస్తుంటాం. కొంతమంది బ్యాట్స్‌మెన్స్ ఒక రకమైన బ్యాట్‌తో, మరికొందరు వేరే రకమైన బ్యాట్‌తో ఆడుతుంటారు. ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఆటగాళ్లు వివిధ రకాల బ్యాట్లను ఉపయోగించారు. అదే సమయంలో కొందరు ఆటగాళ్ల బ్యాట్ విషయంలో వివాదాలు నెలకొన్నాయి.

క్రికెట్ చరిత్రలో చాలా సార్లు ఆటగాడి బ్యాట్ విషయంలో గొడవలు జరిగాయి. దీనిపై ఇప్పటి వరకు పలుమార్లు వాదోపవాదాలు జరిగాయి. బ్యాట్‌పై వివాదాలు కొత్తేమీ కాదు. క్రికెట్ చరిత్రలో బ్యాట్‌కు, వివాదాలకు మధ్య లోతైన సంబంధం ఉంది. అలాంటి బ్యాట్ వివాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

4. క్రికెట్ బ్యాట్ విషయంలో ఇంత పెద్ద వివాదం జరగడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. ఇది 1771 నాటి విషయం. అప్పటికి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం కాలేదు. ఈ వివాదం ఎంతగా పెరిగిందంటే, ఆ తర్వాత క్రికెట్ నిబంధనలను పూర్తిగా మార్చేశారు. అప్పటి నుంచే బ్యాట్ వెడల్పు పరిమితిని నిర్ణయించారు. 1771 సెప్టెంబరు 25న చెర్ట్సే వర్సెస్ హాంబుల్టన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ వివాదం జరిగింది. ఆ మ్యాచ్‌లో, థామస్ వైట్ చాలా వెడల్పుగా ఉన్న బ్యాట్‌తో బ్యాటింగ్‌కు దిగాడు. స్టంప్ మొత్తం బ్యాట్‌తో కప్పబడి ఉంది. ఆ మ్యాచ్‌లో వైట్ ప్రతి బంతిని ఆపడానికి ప్రయత్నించాడు. ఏ బౌలర్ కూడా అతనిని అవుట్ చేయలేకపోయాడు. హాంబుల్టన్ ఆటగాళ్లకు ఈ బ్యాట్‌పై నిరసన తప్ప మరో మార్గం లేకపోయింది.

జట్టు ఫాస్ట్ బౌలర్ థామస్ బ్రెట్ నాయకత్వంలో అతను దానిని తీవ్రంగా వ్యతిరేకించాడు. హాంబుల్టన్ కెప్టెన్, ఆల్ రౌండర్ రిచర్డ్ నైర్న్, ప్రముఖ ఫాస్ట్ బౌలర్, బ్యాట్స్‌మెన్ జాన్ ఒక చిన్న పిటిషన్‌పై సంతకం చేశారు. ఇందులోభాగంగా క్రికెట్ నిబంధనలలో స్వల్ప మార్పు చేసి బ్యాట్ వెడల్పును తగ్గించారు. అయితే, ఆ మ్యాచ్‌లో, హాంబుల్టన్ నిర్దేశించిన 218 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెర్ట్‌సే జట్టు కేవలం 1 పరుగు తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది.

3. 15 డిసెంబర్ 1979న, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లీ అల్యూమినియం బ్యాట్‌తో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 232 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లిల్లీ 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే రెండో రోజు ఆట ప్రారంభం కాగానే డెన్నిస్ లిల్లీ అల్యూమినియం బ్యాట్‌తో బ్యాటింగ్‌కు వచ్చాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.

లిల్లీ ఇంతకు ముందు కూడా అల్యూమినియం బ్యాట్‌లను ఉపయోగించాడు. పెర్త్ టెస్టుకు 12 రోజుల ముందు బ్రిస్బేన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను దానిని ఉపయోగించాడు. కానీ, అప్పుడు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. కానీ, పెర్త్ టెస్టులో ఇయాన్ బోథమ్ వేసిన బంతిని లిల్లీ డ్రైవ్ చేసి 3 పరుగులు చేయడంతో బ్యాట్‌పై వివాదం మొదలైంది. ఆస్ట్రేలియన్ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ బంతి బౌండరీ లైన్‌ను తాకినట్లు భావించాడు. లిల్లీ కోసం 12వ ఆటగాడు రోడ్నీ హాగ్ నుంచి సాధారణ బ్యాట్‌ను పంపాడు. కానీ, లిల్లీ అంగీకరించలేదు. అల్యూమినియం బ్యాట్‌తో ఆడటం కొనసాగించాడు. ఆ తర్వాత, ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ మైక్ బ్రెర్లీ లిల్లీ బ్యాట్‌పై అంపైర్లకు ఫిర్యాదు చేశాడు.

లిల్లీ బ్యాట్ వల్ల బంతి దెబ్బతింటుందని, దీంతో ఆట సమయం వృథా అవుతోందని ఇంగ్లిష్ కెప్టెన్ చెప్పాడు. దీని తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ గ్రెగ్ చాపెల్ స్వయంగా మైదానానికి వచ్చి లిల్లీకి చెక్క బ్యాట్ ఇచ్చాడు. దీంతో కోపోద్రిక్తుడైన లిల్లీ తన బ్యాట్‌ని నేలపైకి విసిరాడు. దీని తర్వాత అతను కొత్త బ్యాట్‌తో బ్యాటింగ్ చేశాడు.

2. 2010 IPL సీజన్‌లో, మాజీ ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ హేడెన్ కూడా అతని బ్యాట్ కారణంగా వివాదంలోవి వచ్చాడు. హేడెన్ ఐపీఎల్ 2010 ఎడిషన్‌లో 'మూంగూస్' అని పిలిచే బ్యాట్‌ను ఉపయోగించాడు. అది ఆటలో చాలా మార్పును తెస్తుందని ప్రజలు నమ్మారు. హేడెన్ చేతిలో MMIThri అనే చిన్న, ప్రమాదకరమైన బ్యాట్ ఉంది. ఈ బ్యాట్‌ను ఉపయోగించడం సరైనదా కాదా అని ఈ బ్యాట్‌పై చాలా వివాదాలు వచ్చాయి.

అదే బ్యాట్‌తో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై హెడెన్ 43 బంతుల్లో 93 పరుగులు చేశాడు. హేడెన్ బ్యాట్‌ను బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మద్ అష్రాఫుల్ సపోర్ట్ చేసినప్పటికీ, 'బ్యాట్‌లో అలాంటి మార్పులు చట్టవిరుద్ధం ఏమీ లేదు. బంతిని సరిగ్గా కొట్టినప్పుడు, అది ఆటోమేటిక్‌గా బౌండరీ లైన్ దాటిపోతుంది' అని ఐపీఎల్‌లో హెడెన్ సహచరుడు సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. కానీ ఈ బ్యాట్ డిఫెండింగ్‌కు సరైనది కాదు. ఈ కారణంగా, నేను సాధారణ బ్యాట్ ఉపయోగించడం ప్రారంభించానంటూ తెలిపాడు. ఆ తర్వాత క్రమంగా ఆ బ్యాట్ వాడకం ఆగిపోయింది.

1. క్రిస్ గేల్ గోల్డెన్ కలర్ బ్యాట్ కూడా చాలా వార్తల్లో నిలిచింది. ఈ బ్యాట్ స్పార్టన్ కంపెనీకి చెందినది. బంగారు రంగులో పెయింట్ చేయబడింది. గేల్ మొదట ఈ బ్యాట్‌ను భారతదేశంలో ఉపయోగించాడు. ఆ తర్వాత 2015 బిగ్ బాష్ లీగ్ సీజన్‌లో ఆస్ట్రేలియాలో కూడా అతను ఈ బ్యాట్‌తో బ్యాటింగ్ చేశాడు. గేల్ BBLలో ఈ బ్యాట్‌తో 23 పరుగుల చిన్న ఇన్నింగ్స్‌ను ఆడాడు. కొన్ని పెద్ద షాట్‌లను కూడా కొట్టాడు. అయినప్పటికీ అతను షార్ట్ బాల్‌ను పుల్ చేసినందుకు అవుట్ అయ్యాడు. కానీ, అప్పటికి అతను రంగు బ్యాట్‌ను ఉపయోగించిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

గేల్ ఈ బ్యాట్‌పై చాలా వివాదాలు తలెత్తాయి. చాలా మంది ఈ బ్యాట్ లోపల లోహం ఉందని నమ్ముతారు. అయితే స్పార్టాన్ యజమాని కునాల్ శర్మ మాత్రం ఈ వివాదాన్ని పూర్తిగా తోసిపుచ్చుతూ.. 'బ్యాట్‌పై మనం వేసిన గోల్డెన్ కలర్‌లో ఎలాంటి లోహం లేదు' అని తెలిపాడు. క్రికెట్‌లో ఎలాంటి బ్యాట్‌తో ఆడాలి, ఎలాంటి బ్యాట్‌తో ఆడకూడదు అనే విషయంలో చాలా నిబంధనలు ఉన్నాయి.





























