- Telugu News Photo Gallery Cricket photos IND vs BAN 1st Test Team India Started Practice For First Test Against Bangladesh
IND vs BAN 1st Test: బుధవారం జరగనున్న మొదటి టెస్ట్ కోసం నెట్ ప్రాక్టీస్ చేస్తున్న టీమ్ ఇండియా.. వైరల్ అవుతున్న ఫోటోలు ఇదిగో..
బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత్.. వన్డే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో ఎలాగైనా టెస్ట్ సిరీస్‌ను తన సొంతం చేసుకోవాలనే పట్టుదలతోఉంది. చిట్టగాంగ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి గ్రౌండ్ వేదికగా.. తొలి టెస్టు మ్యాచ్ ..
Updated on: Dec 13, 2022 | 11:29 AM

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత్.. వన్డే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో ఎలాగైనా టెస్ట్ సిరీస్‌ను తన సొంతం చేసుకోవాలనే పట్టుదలతోఉంది. చిట్టగాంగ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి గ్రౌండ్ వేదికగా డిసెంబర్ 14 నుంచి 18 వరకు భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.

మ్యాచ్‌కు కేవలం ఒక్క రోజే మిగిలి ఉండడంతో ఇప్పటికే చిట్టగాంగ్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు తమ కూడా ప్రాక్టీస్ ప్రారంభించారు.

వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న యువ ఆటగాడు కేఎస్ భరత్ వికెట్ కీపింగ్ ప్రాక్టీస్‌లో బిజీబీజీగా ఉన్నాడు.

రేపు(డిసెంబర్ 14) ఉదయం 9 గంటలకు భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా, 8:30 గంటలకు టాస్ జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లోజరుగుతుంది.

చాాలా కాలం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన ఉమేష్ యాదవ్ కూడా బౌలింగ్ ప్రాక్టీస్‌లో నిమగ్నమైపోయాడు.

తన బ్యాటింగ్ సత్తా ఏమిటో మరో సారి చూపించాలని భావిస్తున్న చెతేశ్వర్ పుజారా క్యాచింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు.

సీనియర్ స్పిన్నర్, ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

కింగ్ కోహ్లీ కూడా జూనియర్లతో కలిసి నెట్ ప్రాక్టీస్ చేస్తూ చెమటలు కక్కిస్తున్నాడు.

ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా మొదటి మ్యాచ్‌కు దూరం కావడంతో కేఎల్ రాహుల్‌కు సారథ్య బాధ్యతలను అప్పగించారు.





























