AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఓయ్ దోస్త్ ఆగు నేను వస్తున్నాగా.. చిన్నారితో స్కూల్‌కెళ్తున్న బేబీ ఏనుగు.. ఎంత ముద్దుగా ఉన్నారో

జంతువులు మనుషుల పట్ల ఎంత ప్రేమను కలిగి ఉంటాయోననే చూపించే చాలా వీడియోలు తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. ఇవి జనాలను ఎప్పటికప్పడూ ఆశ్చర్యపర్చడంతో పాటు.. మానవులు, జంతువుల మధ్య ఉన్న ప్రేమానురాగాలను బయటపెడతాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ అందమైన వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకు ఆ వీడియో ఏంటో చూద్దాం పదండి.

Viral Video: ఓయ్ దోస్త్ ఆగు నేను వస్తున్నాగా.. చిన్నారితో స్కూల్‌కెళ్తున్న బేబీ ఏనుగు.. ఎంత ముద్దుగా ఉన్నారో
Viral News
Anand T
|

Updated on: Dec 05, 2025 | 1:06 PM

Share

సాధారణంగా జనాలు, కుక్కలు, పిల్లులు వంటి పెట్స్‌ను పెంచుకొని వాటితో ఆడుకుంటూ ఉంటారు. కానీ చూడ్డానికి భారీగా కనిపించినా.. ఏనుగులు కూడా మానవులతో చాలా స్నేహంగా, ప్రేమగా మెలుగుతాయి. వాటిని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు అవి మనపై ఎనలేని ప్రేమను కురిపిస్తాయి. తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ వైరల్ వీడియోలో.. స్కూల్‌కు వెళ్తున్న ఒక బాలిక వెంట ఏనుగు వెళ్తున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఆ చిన్నారి ఏనుగుతో పాటు సరదాగా ఆడుకుంటూ స్కూల్‌కు వెళ్తుంది.

ఆ ఏనుగు ఆ బాలిక వెంటనే సరదాగా వెళ్లట్లేదు.. ఆ బాలికకు రక్షణగా, తోడుగా ఏనుగు ఆమెతో పాటు స్కూల్‌కు వెళ్తొంది. ఆ ఏనుగు, చిన్నారి మధ్య ఉన్న స్వచ్చమైన స్నేహ బంధం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. friendly_gaints_conversation అనే Instagram ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోలో చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో నెటిజన్లను ఈ వీడియోను తెగ షేర్ చేశారు.

వీడియో చూడండి.. 

దీంతో ఈ వీడియో ఇప్పటి వరకు 60వేలకుపైగా వీవ్స్‌ను సాధించింది. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. మనుషుల కంటే ఇలాంటి అమాయక జంతువులతో స్నేహం చేయడమే ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. ఇది చూడ్డానికి ఎంత ముద్దుగా ఉందో అంటూ రాసుకొచ్చాడు. నేను కూడా ఈ ఏనుగుతో స్నేహం చేయాలనుకుంటున్నాను అని మరో యూజర్ రాసుకొచ్చాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.