Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Currency: కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తొలగింపు.? దీనిపై ఆర్థిక శాఖ ఏమందంటే..

ప్రస్తుతం అమలులో ఉన్న కరెన్సీ నోట్లపై మార్పులకు తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా గతంలో ఆర్‌బీఐ మాటలనే మరోసారి.. ఆర్థిక శాఖ..

Indian Currency: కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మ తొలగింపు.? దీనిపై ఆర్థిక శాఖ ఏమందంటే..
Gandhi On Indian Currency
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 13, 2022 | 1:28 PM

ప్రస్తుతం అమలులో ఉన్న కరెన్సీ నోట్లపై మార్పులకు తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా గతంలో ఆర్‌బీఐ మాటలనే మరోసారి ఆర్థిక శాఖ కూడా పునరుద్ఘాటించింది. పార్లమెంట్ ‘భారత కరెన్సీ నోట్లపై మరిన్ని చిత్రాలను (లక్ష్మీ దేవి మరియు గణేశుడి చిత్రాలతో సహా) చేర్చాలన్న అభ్యర్థన ప్రభుత్వానికి ఏదైనా అందిందా..?’ అని కాంగ్రెస్ నేత, లోక్‌సభ సభ్యుడు ఆంటో ఆంటోనీ అడిగారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆర్ధిక శాఖ ‘‘ భారతీయ నోట్లపై స్వాతంత్య్ర సమరయోధులు, ప్రముఖులు, దేవతలు, జంతువులు తదితర చిత్రాలను చేర్చాలని పలు అభ్యర్థనలు వచ్చాయ’’ని తెలిపింది.

భారత కరెన్సీ నోట్ల నుంచి జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాన్ని తొలగించే ఆలోచన ప్రభుత్వం వద్ద లేదని కూడా మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇంకా మాట్లాడుతూ.. కరెన్సీ నోట్లపై చిత్రాలకు సంబంధించి అనేక అభ్యర్థనలు/సూచనలు స్వీకరించామని, దీనిపై ఈ ఏడాది జూన్ 06న ఆర్‌బీఐ పత్రికా ప్రకటనను విడుదల చేసిందని ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే ప్రస్తుత కరెన్సీ, బ్యాంకు నోట్లలో మార్పులకు ఎటువంటి ప్రతిపాదన లేదని తమ వద్ద మరోసారి స్పష్టం చేసింది.

కాగా, గతంలో కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోను తొలగిస్తున్నారన్న ఊహాగానాలను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ తోసిపుచ్చింది. అలాంటి ప్రతిపాదనేదీ లేదని తేల్చి చెప్పింది. ఈ ఏడాది జూన్ నాటికి అనేక వదంతులు తీవ్ర కలకలం రేపడంతో.. RBI దీనిపై ఆ నెల 6న పత్రికా ప్రకటనను కూడా ఇచ్చింది. నోట్లపై మార్పు, గాంధీజీ ఫోటో తొలగింపు వంటి ప్రతిపాదనలేవీ తమ వద్ద లేవని కుండబద్ధలు కొట్టి మరి చెప్పింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్