AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ‘నేషనల్ క్రష్’ ఇన్‌స్టా హాక్ అయిందా.? ఆందోళనలో అభిమానులు. ఆమె ఏమన్నదంటే..?

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మెగా విజయం కావడంతో రష్మిక పాపులారిటీ విపరీతంగా పెరిగింది. పుష్ప సినిమాలో శ్రీవల్లిగా సినీ ప్రేక్షకులను, సినీ నిర్మాతలను అమితంగా.. ఇంకా..

Rashmika Mandanna: ‘నేషనల్ క్రష్’ ఇన్‌స్టా  హాక్ అయిందా.? ఆందోళనలో అభిమానులు. ఆమె ఏమన్నదంటే..?
Rashmika Mandanna
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 13, 2022 | 12:05 PM

Share

రష్మిక మందన్న గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఇప్పటికే దేశవ్యాప్తంగా క్రష్మికగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా ఫాలోవర్లను కలిగిన దక్షిణాది నటి. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మెగా విజయం కావడంతో రష్మిక పాపులారిటీ విపరీతంగా పెరిగింది. పుష్ప సినిమాలో శ్రీవల్లిగా సినీ ప్రేక్షకులను, సినీ నిర్మాతలను అమితంగా ఆకర్షించిన ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో.. తన ఫోటోలు లేదా వీడియోలను పోస్ట్ చేసి, ఇంటర్నెట్‌లో తుఫాను వాతావరణం ఏర్పడేలా చేస్తుంది. అయితే ఇప్పుడు రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హాక్ అయిందని సోమవారం నుంచి ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. సోమవారం రష్మిక ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఆమె పేరు రివర్స్ ఆర్డర్‌లో కనిపించడాన్ని అభిమానులు గమనించారు. ఎవరో తమ అభిమాన నటి ఖాతాను హాక్ చేసి ఇలా చేసి ఉంటారని అభిమానులంతా హంగామా చేసేశారు.

అయితే ‘బాలిక విద్య ప్రాముఖ్యత’ గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు ‘ప్లమ్ ప్రాజెక్ట్ బ్లాక్‌బోర్డ్’ ప్రచారంలో ఇదంతా ఒక భాగమని రష్మిక మందన్న తర్వాత వెల్లడించింది. రివర్స్ ఆర్డర్‌లో పేరు ఉన్న తన బయో స్క్రీన్‌షాట్‌ను పంచుకుంటూ.. రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో “చదవడం తెలియనప్పుడే చిన్నారులు ఇలా భావిస్తారు. దానిని మార్చే లక్ష్యంతో ప్లం గుడ్‌నెస్ పనిచేస్తోంది’’ అని రాసుకొచ్చింది. ఇదిలా ఉంటే రష్మిక అనవసర కారణాలతో ఈ మధ్య వార్తల్లో నిలుస్తోంది. రిషబ్ శెట్టి నటించిన కాంతారాపై ఆమె చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురయింది రష్మిక. రిషబ్ శెట్టి దర్శకత్వంలో, అతనే హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తాను ఇంకా చూడలేదని ఒప్పుకున్న తర్వాత రష్మిక కొంతకాలం నిప్పులు చెరిగింది.

కాగా, బెంగుళూరులో మీడియా సమావేశంలో మాట్లాడిన రష్మిక “కాంతారా సినిమా విడుదలైన 2-3 రోజుల తర్వాత చూశావా అని నన్ను అడిగారు. అప్పటికి నేను చూడలేకపోయాను. నేను ఈ మధ్యే ఆ సినిమా చూసి, కాంతారా టీమ్‌కు నా అభినందనలను కూడా పంపించాను. వారు కూడా దానికి ధన్యవాదాలు తెలిపారు. లోపల ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. మా వ్యక్తిగత జీవితాలను కూడా కెమెరా పెట్టుకుని చూపించలేం” అని చెప్పింది. మరోవైపు కన్నడ చిత్ర పరిశ్రమలో తనను నిషేధిస్తున్నారనే వార్తలపై కూడా రష్మిక స్పందించింది. ‘‘ఇప్పటి వరకు నన్ను ఏ నిర్మాత నిషేధించలేదు’’ అని రష్మిక మందన్న తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.