Health Tips: నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతున్నారా..? అయితే మీ కోసమే ఈ సమాచారం..

కొంత మంది నోటి నుంచి సహజంగానే  దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్య ఉన్నవారు కొన్ని రకాల జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించి తీరాల్సి ఉంటుంది. లేకపోతే నలుగురితో మనం నవ్వులపాలు కావల్సి వస్తుంది.. అంతే కాక..

Health Tips: నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతున్నారా..? అయితే మీ కోసమే ఈ సమాచారం..
Mouth Smell
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 13, 2022 | 9:25 AM

కొంత మంది నోటి నుంచి సహజంగానే  దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్య ఉన్నవారు కొన్ని రకాల జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించి తీరాల్సి ఉంటుంది. లేకపోతే నలుగురితో మనం నవ్వులపాలు కావల్సి వస్తుంది. అంతే కాక మన నోటి దుర్వాసన వస్తుండడంతో మనలోని ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  అంతేకాక మన నోటి దుర్వాసన రావడం వల్ల నలుగురుతో మాట్లాడటానికి చాలా వరకు ఇష్టపడక, అవాయిడ్ చేస్తూ ఉంటాం. దానికి తోడు పక్కవారు కూడా మనతో మాట్లాడేందుకు సహసించరు. నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు ఎక్కువగా మౌత్ వాష్‌లని, చూయింగ్ గమ్‌లపై ఆధారపడుతుంటారు.అయితే సహజమైన పద్ధతుల్లో కూడా నోటి దుర్వాసనను నివారిచుకోవచ్చు. ముఖ్యంగా నోటి దుర్వాసన పంటి సమస్యల వల్ల వస్తుంటుంది. వీలైనంత వరకు మన నోటిని పళ్లను శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. ప్రతి రోజు ఉదయం బ్రష్ చేసిన తరువాత తప్పనిసరిగా ఉప్పు నీటితో నోటి శుభ్రంచేసుకుంటే చక్కని ఫలితం దక్కుతుంది.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కళ్లుప్పు వేసుకుని కలిపి.. దానిని రోజులో రెండు మూడు సార్లైనా పుక్కిలించాలి. అది కూడా ఆహారం తీసుకున్న తరువాత ఇలా చేయడం వల్ల నోట్లో ఏదైనా ఆహారం మిగిలిపోయి ఉంటే నోరు శుభ్రం అవుతుంది. అంతేకాదు నోటి దుర్వాసన దూరం కావడంతో పాటు చిగుర్ల సమస్యలు కూడా మటుమాయం అవుతాయి. ఇంకా బ్రష్‌ చేయడానికి ఇంటి పేస్ట్‌నే వినియోగించడం మేలు.  ఎంతో సులువుగా పేస్ట్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి, పసుపు, కాస్త ఉప్పు, అందులో నువ్వుల నూనె వేసి పేస్టులా చేసుకుని దీనితో పళ్లను తోమాలి. తద్వారా పంటి సమస్యలు తీరడంతో పాటు నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. ఔషధగుణాలున్న నిమ్మరసంతో బ్రష్‌ చేయడం వల్ల దుర్వాసన సులభంగా తగ్గించుకోవచ్చు.

రోజులో రెండు సార్లు బ్రష్‌ చేయడాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. దానికి తోడు టూత్‌ బ్రష్‌లను రెండు మూడు నెలలకు ఒకసారి మారుస్తూ ఉండాలి. నోట్లోని చెడు వాసనకు కారణమైన బ్యాక్టీరియాను తరిమేందుకు సహజసిద్ధమైన మౌత్‌ వాష్‌లను వినియోగించండి. బ్రష్ చేయడంతో పాటు నాలుకను టంగ్ క్లీనర్‌తో చాలా శుభ్రంగా కడగాలి. ఉల్లి, వెల్లుల్లితో తయారు చేసిన వంటకాలకు దూరంగా ఉండడం చాలా వరకూ మంచిది. మరీ ముఖ్యంగా సిగరేట్‌ వినియోగానికి దూరంగా ఉండాలి. రోజులో కనీసం రెండు మూడు లవంగాలు, సోంపు వంటివి తింటుండాలి. ఇందులో ఉండే మంచి గుణాలు నోట్లోని బ్యాక్టీరియాను దూరం చేసి, నోటి దుర్వాసన సమస్యను నివారిస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!