AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: రాత్రివేళ సాక్స్‌ ధరించి నిద్రించడం వల్ల అనేక ప్రయోజనాలు.. అయితే ఆ ఒక్క తప్పు మాత్రం చేయకూడదు.. అదేమిటంటే..?

చలికాలంలో చాలామంది రాత్రివేళల్లో నిద్రపోయే ముందు సాక్స్‌లు ధరించి పడుకుంటారు. నిద్రపోయే ముందు సాక్స్ ధరించడం ద్వారా మన పాదాలు, అరికాళ్ళు వెచ్చగా ఉంటాయి. సాక్స్ ధరించి నిద్రించడం వల్ల శరీర ఉష్ణోగ్రత.. ఇంకా..

Health Tips: రాత్రివేళ సాక్స్‌ ధరించి నిద్రించడం వల్ల అనేక ప్రయోజనాలు.. అయితే ఆ ఒక్క తప్పు మాత్రం చేయకూడదు.. అదేమిటంటే..?
Sleeping With Socks
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 13, 2022 | 8:55 AM

Share

చలికాలంలో చాలామంది రాత్రివేళల్లో నిద్రపోయే ముందు సాక్స్‌లు ధరించి పడుకుంటారు. నిద్రపోయే ముందు సాక్స్ ధరించడం ద్వారా మన పాదాలు, అరికాళ్ళు వెచ్చగా ఉంటాయి. సాక్స్ ధరించి నిద్రించడం వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా అదుపులో ఉండి రక్త ప్రసరణ పెరుగుతుంది. సాధారణంగా చలికాలంలో చలి కారణంగా త్వరగా నిద్రపోవడం కష్టం. కానీ సాక్స్ ధరించి నిద్రపోవడం వల్ల శరీరం వేడెక్కుతుంది. తద్వారా మనం సులువుగా నిద్రపడుతుంది. ఇవే కాకుండా సాక్సులు ధరించి నిద్రపోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వీటివల్ల కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. సాక్స్ ధరించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. లేదంటే అది ఆరోగ్యంపై భారంగా ఉంటుంది. సాక్స్ ధరించి నిద్రించడం వల్ల మన ఆరోగ్యానికి కలిగే లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం..

చలి నుంచి రక్షణ: సాక్స్‌తో పడుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. సాక్స్ ధరించడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. చలికాలంలో చలి వల్ల తొందరగా నిద్రపోవడం కష్టమైనా.. సాక్స్ వేసుకుని పడుకోవడం వల్ల శరీరం వేడిగా ఉంటుంది. తద్వారా మనకు త్వరగా నిద్ర పడుతుంది.

తిమ్మిర్లు తగ్గుతాయి: చలి కారణంగా చేతులు, కాళ్లు బిగుసుగా మారుతాయి. ఫలితంగా శరీరంలో తిమ్మిరి సమస్యలు ఎదురవుతాయి. సాక్స్ ధరించి నిద్రించడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు. సాక్స్ ధరించి పడుకోవడం వల్ల రేనాడ్స్ సిండ్రోమ్‌ కూడా తగ్గుముఖం పడుతుంది.

ఇవి కూడా చదవండి

పగిలిన మడమలు నయం: సాక్స్ వేసుకుని రాత్రిళ్లు నిద్రించడం వల్ల పాదాలు దుమ్ము, గాలికి దూరంగా ఉండడమే కాక పాదాలకు పగుళ్లు రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ మడమలు పగులుతున్నట్లయితే పాదాలకు క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ అప్లై చేసి తర్వాత సాక్స్ ధరించాలి. దీనివల్ల పాదాలు, మడమలు మృదువుగా మారుతాయి.

ఈ తప్పు మాత్రం చేయవద్దు: సాక్స్ ధరించి నిద్రించడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. కానీ ఒక పొరపాటు చేయడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంది. సాక్స్ బిగుతుగా ఉంటే అది రక్త ప్రసరణను తగ్గించడమే కాక ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. దీనికి అదనంగా సాక్స్ ధరించేటప్పుడు అవి శుభ్రంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. మురికి సాక్స్ పాదాలకు హాని కలిగిస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..