Watch Video: పెంపుడు కుక్కను అలంకరించి..అపై ఆ మహిళ ఏం చేసిందంటే..? వైరల్ అవుతున్న వీడియోను మీరే చూడండి..
కొన్ని జంతువులకు మానవుడితో విడదీయరాని సంబంధం ఉంది. అలాంటి జంతువులనే మనం పెంపుడు జంతువులు లేదా పెట్స్ అని పిలుచుకుంటాం. వాటిని పెంచుకునేవారు తమ కుటుంబ సభ్యులుగానే పరిగణిస్తారు. ఇంకా...
కొన్ని జంతువులకు మానవుడితో విడదీయరాని సంబంధం ఉంది. అలాంటి జంతువులనే మనం పెంపుడు జంతువులు లేదా పెట్స్ అని పిలుచుకుంటాం. వాటిని పెంచుకునేవారు తమ కుటుంబ సభ్యులుగానే పరిగణిస్తారు. ఇంకా చెప్పాలంటే వాటికి సంబంధించిన ప్రత్యేక సందర్భాలను నలుగురితో పంచుకోవాలని, చెప్పుకోవాలని ఆరాటపడుతుంటారు. వాస్తవానికి అవి జంతువులే అయినప్పటికీ తమ పిల్లలే అన్నట్లుగా వాటి అలనాపాలనా చూసుకుంటారు. నిత్యం వాటికి కావలసిన ఆహారం పెట్టిన తర్వాతే కొందరు తాము భోజనం చేసేవారు కూడా ఉన్నారు. అచ్చం అలాంటివారి కోవకే చెందిన ఓ మహిళ తన పెంపుడు కుక్క పిల్లతో ఉన్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. చిన్నపిల్లలకు స్నానం చేయించినట్లుగానే తన కుక్క పిల్లకు కూడా బేబీ సవర్ చేయించింది ఆ మహిళ. ఇంకా ఆ తర్వాత కంచాలలో భోజనం పెట్టుకుని తీసుకెళ్లి వీధి కుక్కలన్నింటికీ కూడా తినిపించింది.
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఆమె చేసిన పనులకు నెటిజన్లు పూర్తిగా విస్మయం చెందుతున్నారు. అంతేకాక ఈ వీడియోకు విశేషస్థాయిలో తమ స్పందనలను కామెం చేస్తున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో “బేబీ షవర్ ఫర్ మై క్యూటీ” అనే టెక్స్ట్ ఓవర్‌లేతో రన్ అవుతుంది. వీడియోలో ఆ యువతి తన కుక్క పిల్లకు చున్నీని చుట్టడం, మెడలో దండను చుట్టడం, నుదిటిపై తిలకం పెట్టడం కూడా మనం చూడవచ్చు. అలా చేసిన తర్వాత తన ఇంట్లో ఉన్న కొన్ని కంచాలలో భోజనం పెట్టి వీధి కుక్కలకు తినిపిస్తుంది.
నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.
View this post on Instagram
నవంబర్ 20న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినప్పటి నుంచి వీడియో 49 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించింది. ఇంకా దాదాపు మూడు లక్షల 45వేలకు పైగా లైకులు కూడా వచ్చాయి. ‘నేను ఇప్పటివరకు చూడని అత్యంత మధురమైన విషయం ఇది. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను తప్పక ఆశీర్వదిస్తాడు’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. ‘మీ ఆలోచనలు, పని మా ఊహకు అందనిది. ఇలాగే కొనసాగించండి’ అని మరొకరు కామెంట్ చేశారు. ‘ఈరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే అత్యుత్తమమైనది’ అని హార్ట్ ఎమోజీలతో మరో నెటిజన్ రాసుకొచ్చాడు. ఇలా నెటిజన్లు తమ తమ స్పందనలను కామెంట్ చేస్తున్నారు.