Bengaluru: ఆ టైమ్ లో బయట తిరుగుతున్నారంటూ రూ.3 వేలు ఫైన్.. పోలీసుల తీరుతో కంగుతిన్న దంపతులు..
నగరం అంటేనే చాలా రద్దీగా ఉంటుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా జన సంచారం ఉంటుంది. ఐటీ నగరిగా పేరు గాంచిన బెంగళూరు నగరంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. అక్కడ రాత్రయినా...

నగరం అంటేనే చాలా రద్దీగా ఉంటుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా జన సంచారం ఉంటుంది. ఐటీ నగరిగా పేరు గాంచిన బెంగళూరు నగరంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. అక్కడ రాత్రయినా విపరీతమైన రష్ ఉంటుంది. ఈ క్రమంలో పోలీసులు చేసిన ఓ పని నెటిజన్లు, నగరవాసుల ఆగ్రహానికి గురి చేసింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే పౌరుల పట్ల దారుణంగా ప్రవర్తించారు. లేనిపోని చట్టాల పేరుతో అమానుషంగా ప్రవర్తించారు. రాత్రి వేళ బయట తిరుగుతున్నారన్న కారణంతో రూ.3 వేలు ఫైన్ వేశారు. రాత్రి సమయం కావడంతో బాధితులు వారి చెప్పినంత ఇచ్చుకోక తప్పలేదు. ఈ ఘటనను వివరిస్తూ బాధితుడు ట్విట్టర్ లో ట్వీట్ చేసి నగర కమిషనర్ కు ట్యాగ్ చేశారు. కర్నాటక రాజధాని బెంగళూరు నగరానికి చెందిన భార్యాభర్తలు.. అర్ధరాత్రి 12.30 గంటలకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే సమయంలో అక్కడికి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వాహనంలో ఇద్దరు పోలీసులు వచ్చారు. ఆ దంపతులను ఆపారు. రాత్రి వేళల్లో ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘించారని ఫైర్ అయ్యారు. ఇందుకు రూ.3 వేలు ఫైన్ కట్టాలని డిమాండ్ చేశారు. బర్త్‌డే పార్టీకి వెళ్లి వస్తున్నామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో వారు అడిగినంత ఇవ్వక తప్పలేదు.
అయితే ఈ ఘటన జరిగిన తీరును కార్తీక్ పత్రి అనే వ్యక్తి.. ట్విట్టర్లో వివరాలు వెల్లడించారు. ఆ ట్వీట్ ను బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ పై వెంటనే స్పందించిన పోలీసులు దంపతుల నుంచి డబ్బు వసూలు చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. వారిపై శాఖాపరమైన విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. జరిమానా చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులను బాధితులను బెదిరించడం గమనార్హం. ఇలాంటి ఘటనలు ఎవరికైనా ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని బెంగళూరు పోలీసులు సూచించారు.




నా స్నేహితుడి బర్త్‌డే పార్టీకి నా భార్యతో కలిసి వెళ్లాను. వేడుక ముగిసిన అనంతరం ఇద్దరం కలిసి ఇంటికి వెళ్తున్నాం. అదే సమయంలో పెట్రోలింగ్ వ్యాన్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. మమ్మల్ని ఆపి.. ఐడీ కార్డులు చూపించమన్నారు. వెంటనే నా ఫోన్లో ఉన్న ఆధార్ కార్డు ఫొటోలు చూపించాం. తర్వాత నా దగ్గర ఉన్న ఫోన్ ను లాక్కున్నారు. పోలీసులు చలానా బుక్తీసి మా పేర్లు, ఆధార్ నెంబర్లు రాసుకున్నారు. ఎందుకు చలాన్ రాస్తున్నారని అడిగితే.. రాత్రి 11 గంటల తర్వాత రోడ్డుపై తిరగడానికి అనుమతి లేదని చెప్పారు. అలాంటి రూల్స్ లేదని తెలిసినా అర్ధరాత్రి కావడం వల్ల మౌనంగా ఉండిపోయా. పోలీసులకు క్షమాపణలు చెప్పాం. కానీ వారు మమ్మల్ని విడిచిపెట్టలేదు. రూ.3,000 ఫైన్ కట్టాలని డిమాండ్ చేస్తే.. చివరకు రూ.1,000 కట్టాం.
– బాధితుడు..
I would like to share a traumatic incident my wife and I encountered the night before. It was around 12:30 midnight. My wife and I were walking back home after attending a friend’s cake-cutting ceremony (We live in a society behind Manyata Tech park). (1/15)
— Karthik Patri (@Karthik_Patri) December 9, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం..