Migraine: మీరు మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఆహారం విషయంతో ఈ జాగ్రత్తలను తప్పక పాటించండి

ప్రస్తుత కాలంలో మానవుడు అవలంభిస్తున్న ఆహారపు అలవాట్ల కారణంగా స్వయంగా అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాడు. వాటిల్లో కొన్ని స్వల్ప కాలమే ప్రభావం చూపగలిగేవి అయితే మరికొన్ని..

Migraine: మీరు మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఆహారం విషయంతో ఈ జాగ్రత్తలను తప్పక పాటించండి
Migraine
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 13, 2022 | 6:47 AM

ప్రస్తుత కాలంలో మానవుడు అవలంభిస్తున్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా స్వయంగా అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాడు. వాటిల్లో కొన్ని స్వల్ప కాలమే ప్రభావం చూపగలిగేవి అయితే మరికొన్ని దీర్ఘ కాలిక సమస్యలు. అలాంటి ఆరోగ్య సమస్యలలో మైగ్రేన్, షుగర్, బీపీ వంటివి ప్రముఖమైనవి. షుగర్, బీపీ అనేవి ఆకస్మికంగా కలిగే ఆరోగ్య సమస్యలు. అయితే మైగ్రేన్ అలా కాదు. నిరంతరం మనల్ని వేధిస్తుంటుంది. పైగా ఈ రోజుల్లో మైగ్రేన్ అనేది సర్వసాధారణమైన సమస్యగా మారింది. ఈ సమస్యతో బాధపడేవారికి తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. ఈ నొప్పి కొన్నిసార్లు భరించలేనిదిగా మారడమే కాక అదే సమయంలో వాంతులు, వికారంతో మనల్ని బాధించవచ్చు.

మైగ్రేన్‌ సమస్య వర్చువల్, రియల్ అనే రెండు రకాలు ఉన్నాయి. మైగ్రేన్ వ్యాధి మానసిక ఒత్తిడి, నాడీ ఉద్రిక్తత, అలసట, మలబద్ధకం, అధిక మద్యపానం, రక్తహీనత, జలుబు వంటి ఆరోగ్య సమస్యల వల్ల వస్తుంది. దీనిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సులభంగా నయం చేయవచ్చు. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే అనారోగ్యానికి గురవుతారు. మరి మైగ్రేన్ సమస్యను ఎలా నివారించాలో.. ఆ సమస్య ఉన్నవారు ఏమేం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మైగ్రేన్ బాధితులు తినదగినవి..

అరటిపండు: అరటిపండు నిస్సందేహంగా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండడం వల్ల మన ఆరోగ్య సమస్యలు నియంత్రణలో ఉంటాయి. పొటాషియం వల్ల అధిక రక్తపోటు, మెగ్నీషియం వల్ల రక్తంలోని చక్కెరను అదుపు చేయవచ్చు. అంతేకాకుండా మెగ్నీషియం మైగ్రేన్‌ సమస్యతో బాధపడేవారికి కూడా మేలు చేస్తుంది. అందు కోసం ప్రతిరోజూ కనీసం ఒక అరటిపండు అయినా తినాలి.

ఇవి కూడా చదవండి

సీఫుడ్: ఆరోగ్య నిపుణుల ప్రకారం సీఫుడ్ తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ మైగ్రేన్‌ బాధితులకు మేలు చేస్తుంది. ఒకవేళ మీరు మైగ్రేన్ బాధితులైతే మీరు వారానికి రెండుసార్లు సీఫుడ్ తినాలి. అదనంగా ఆకుపచ్చ కూరగాయలు, విటమిన్-సీ లేని పండ్లు తీసుకోవచ్చు.

మైగ్రేన్ బాధితులు తినకూడనివి..

టీ, కాఫీ: సాధారణంగా టీ , కాఫీ తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని చెబుతారు.  అయితే మైగ్రేన్ బాధితులు టీ, కాఫీలు తాగకూడదు. వీటిల్లో పుష్కలంగా లభించే కెఫిన్ మైగ్రేన్‌ నుంచి ఉపశమనం కలిగించకపోగా.. సమస్యను పెంచుతుంది.

మద్యం: మద్యపానం మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో పుష్కలంగా ఉండే  ఆల్కహాల్ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మైగ్రేన్ బాధితులు మద్యం సేవించకూడదు. దాని వల్ల మైగ్రేన్‌ సమస్యను తీవ్రతరం చేస్తుంది.

డార్క్ చాక్లెట్: డార్క్ చాక్లెట్ మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని అనేక సందర్భాలలో రుజువు అయింది. దీనిని తీసుకోవం వల్ల వివిధ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే మైగ్రేన్‌ బాధితులు డార్క్‌ చాక్లెట్‌ను తీసుకోకూడదు. మైగ్రేన్ బాధితులు డార్క్ చాక్లెట్‌ను తింటే సమస్యను పెంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!