Sea Salt vs Table Salt: ఉప్పు ఉంటేనే ఆహారం రుచికరం.. మరి ఏ రకం సాల్ట్ మీ ఆరోగ్యానికి ఉపయోగకరమో తెలుసుకోండి..

ఆహారం రుచికరంగా మారడానికి ఉప్పు ప్రధాన పాత్ర వహిస్తుంది. అయితే మార్కెట్‌లో మనకు అనేక రకాల ఉప్పు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైన ప్రధాన రకాలు సముద్రపు ఉప్పు, కల్లుప్పు. మన ఆహారపు రుచిని, ఆరోగ్యాన్ని ఇంకా..

Sea Salt vs Table Salt: ఉప్పు ఉంటేనే ఆహారం రుచికరం.. మరి ఏ రకం సాల్ట్ మీ ఆరోగ్యానికి ఉపయోగకరమో తెలుసుకోండి..
Rock Salt Vs Sea Saly
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 13, 2022 | 7:20 AM

ఆహారం రుచికరంగా మారడానికి ఉప్పు ప్రధాన పాత్ర వహిస్తుంది. అయితే మార్కెట్‌లో మనకు అనేక రకాల ఉప్పు లభిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైన ప్రధాన రకాలు సముద్రపు ఉప్పు, కల్లుప్పు. మన ఆహారపు రుచిని, ఆరోగ్యాన్ని కాపాడి మెరుగుపరచడంలో ఏ ఉప్పు మంచిదో మీకు తెలుసా..? సముద్రపు ఉప్పు ప్రజాదరణ పొందిన ఉప్పు. దీనిని మన ఆహారంలో నిత్యం వాడడం వల్ల ఆరోగ్యానికి మేలు చేయడమే కాక బరువు తగ్గడానికి కూడా ఎంతగానో ఉపకరిస్తుంది. పైగా ఇది సేంద్రీయంగా, సహజంగా, స్వచ్ఛమైనదిగా చెప్పుకోవచ్చు. మరి సముద్రపు ఉప్పు లాభలేమిటో తెలుసుకుందాం.. ఉప్పు శరీరానికి కావలసిన అయోడిన్ లోపాన్ని తీర్చడమే కాక హైపోథైరాయిడిజం వంటి వ్యాధుల నుంచి రక్షిస్తుంది. కాబట్టి ఉప్పును క్రమం తప్పకుండా మన ఆహారంలో భాగంగా సరిపడినంతగా తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు ఉప్పు తీసుకోవడం వల్ల అయోడిన్ లోపం నుంచి తల్లి,  బిడ్డను సురక్షితంగా ఉంటారు.

చేతులు లేదా కాళ్ళలో వాపు ఉంటే సాధారణంగా వేడి నీళ్లతో స్నానం చేస్తారు. అయితే మరో విధంగా ఆ సమస్యల నుంచి ఉపశమనం కోసం ఉప్పును శరీరానికి రాసుకోవచ్చు. లేదా ఉప్పును గుడ్డలో చుట్టి వెచ్చగా ఉంచి శరీరం మీర పెడితే సమస్య పరిష్కారమవుతుంది. అలా చేయడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సోడియం, పొటాషియం సమతుల్యత చాలా అవసరం. సాధారణ ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది శరీరంలోని మెగ్నీషియం సమతూల్యతకు హాని కలిగిస్తుంది. అందువల్ల సోడియం క్లోరైడ్ లేదా టేబుల్ ఉప్పు కంటే సముద్రపు ఉప్పు మంచిది. పొడి ఉప్పును సోడియం క్లోరైడ్ నుండి తయారు చేస్తారు. ఈ ఉప్పు సహజంగా లభించే సముద్రపు ఉప్పు, రాతి ఉప్పు మరియు స్ఫటిక ఉప్పు వలె కనిపించినప్పటికీ, పొడి ఉప్పులో దాని సహజ పదార్ధాలు ఏవీ లేవు, కానీ దాని రుచిని అనుకరిస్తుంది.

మార్కెట్‌లలో లభించే లేదా హోటళ్లలో మనకు అందుబాటులో ఉంచే పౌడర్ ఉప్పులో సింథటిక్ రసాయనాలు ఉంటాయి. ఈ పొడి ఉప్పు మన ఆరోగ్యానికి హానికరమైనదేకాక అది విషపూరితమైనదిగా నిపుణులు చెబుతున్నారు. సముద్ర ఉప్పులో ఉండే సహజ అయోడిన్ కంటెంట్ ఈ పొడి ఉప్పులో ఖచ్చితంగా ఉండదు. అందువల్ల  కల్లుప్పు మీ థైరాయిడ్ గ్రంధులను తీవ్రంగా దెబ్బతీస్తుంది, ఇంకా జీవక్రియ సమస్యలకు కూడా దారితీస్తుంది. పౌడర్ ఉప్పును ముడి చమురు సారం నుంచి తయారు చేస్తారు. 1200 డిగ్రీల ఫారెన్‌హీట్ వద్ద ఆముదం నూనెను వేడి చేయడం ద్వారా పొడి ఉప్పు తయారవుతుంది. ఈ ఉష్ణోగ్రత వద్ద ఉప్పును వేడి చేసినప్పుడు అందులోని 80 శాతం అవసరమైన ఖనిజాలు పోతాయి.

ఇవి కూడా చదవండి

గుండె ఆరోగ్యం: మీ ఆహారంలో ఎక్కువ ఉప్పు లేదా సోడియం ఉంటే అది అధిక రక్తపోటు, గుండె జబ్బులు, హార్ట్ స్ట్రోక్‌లకు దారి తీస్తుంది. ఇంకా శరీరంలోని కాల్షియాన్ని తొలగిస్తుంది. ఎక్కువగా ఉప్పు తినడం వల్ల ఎముక సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. అయిే ఉప్పు ఆహారానికి రుచిని పెంచడమే కాకుండా అనేక విధాలుగా ఆరోగ్యాన్ని అందిస్తుంది. కానీ ఉప్పు అపరిశుభ్రంగా ఉంటే అది అనేక రకాల హానిని కలిగిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి