AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dharshan: ‘అదృష్ట దేవత ఇంటికి వస్తే.. మొత్తం తీసేసి’ అంటూ.. కన్నడ మూవీ స్టార్ చెత్త వాగుడు..

కొందరు సెలబ్రిటీలు కొన్ని సందర్భాలలో ఉద్దేశపూర్వకంగా అంటారో లేక అనుకోకుండా అనేస్తారో తెలియదు కానీ  తమ పరిధిని దాటి మాట్లాడుతుంటారు. తాము చెప్పాలనుకున్నది ఆకట్టుకునేలా చెప్పబోయే క్రమంలో పప్పులో.. తర్వాత బాధ..

Dharshan: ‘అదృష్ట దేవత ఇంటికి వస్తే.. మొత్తం తీసేసి’ అంటూ..  కన్నడ మూవీ స్టార్ చెత్త వాగుడు..
Kannada Hero Dharshan
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 12, 2022 | 9:58 AM

Share

కొందరు సెలబ్రిటీలు కొన్ని సందర్భాలలో ఉద్దేశపూర్వకంగా అంటారో లేక అనుకోకుండా అనేస్తారో తెలియదు కానీ  తమ పరిధిని దాటి మాట్లాడుతుంటారు. తాము చెప్పాలనుకున్నది ఆకట్టుకునేలా చెప్పబోయే క్రమంలో పప్పులో కాలేస్తుంటారు. అనవసరపు ఇంకా చెప్పుకోవాలంటే పనికిరాని ఉదాహరణలతో.. పబ్లిక్‌ మనోభావవాలు హర్ట్ అయ్యేలా ప్రవర్తిస్తారు. అంతా అయ్యాక తల పట్టుకుని సారీ అంటూ కాళ్ల బేరానికి వచ్చేస్తారు. అలాగే కన్నడ స్టార్ హీరో దర్శన్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కన్నడ సూపర్ స్టార్ దర్శన్ తన మాటల వల్ల కలిగే పరిణామాల గురించి పెద్దగా ఆలోచించకుండా.. మనసులోని మాటను బయటపెడుతుంతాడు. విడుదల కాబోయే తన సినిమా ‘క్రాంతి’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూ ఇస్తున్న దర్శన్ ఒక్క సారిగా నోరు జారాడు.

అదృష్ట దేవత వరించడం గురించి దర్శన్‌ను అడిగినప్పుడు అతను వివాదాస్పదంగా బధులిచ్చాడు. ‘‘అదృష్ట దేవతే స్వయంగా ఇంటికి వస్తే వెంటనే ఆమెను బట్టలు విప్పి ఇంట్లో బందీగా ఉంచుకోవాలి. ఎందుకంటే మీరు ఆమెకు బట్టలు ఇచ్చి విడిపిస్తే ఆమె వేరే చోటికి వెళ్ళిపోతుంది’’ అని వివాదాస్పదంగా మాట్లాడాడు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు కాస్తా తీవ్ర దూమారాన్ని లేపుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు దర్శన్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడే ముందు ఆలోచించాలని, ఆలోచించకుండా మాట్లాడడం సబబు కాదని హితవు పలుకుతున్నారు. కాగా దర్శన్ ఇప్పటికే రెండు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని చెప్పాడు. ఈ విషయం ఆసక్తికరమైనదేమంటే.. ఈ వ్యాఖ్యల కారణంగా దర్శన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారిలో అతని అభిమానులు కూడా ఉన్నారు.

కాగా గతంలో కూడా దర్శన్ ఇలాంటి వ్యాఖ్యలే చేసి పునిత్ రాజ్ కుమార్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. కన్నడ సినీ  ప్రేక్షకుల నుంచి తనకు విశేష ఆదరణ లభిస్తోందని..  ఎంతగా అంటే దివంగత పునీత్ రాజ్‌కుమార్ మాదిరిగానే కన్నడీగులు తనపై అభిమానాన్ని చూపిస్తాన్నారని అన్నాడు. ఎటువంటి దురుద్దేశం లేకుండా మంచి స్ఫూర్తితో అతను అన్నప్పటికీ.. అతని వ్యాఖ్య పవర్ స్టార్ అభిమానులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఫలితంగా దర్శన్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కానీ కొంత కాలానికి ఆ సమస్య సమసిపోయింది.

ఇవి కూడా చదవండి