Shepherds Dance: బాలీవుడ్ హీరో పాటకు గొర్రెల కాపరి అదిరిపోయే స్టెప్పులు.. ట్రెండ్ అవుతున్న వీడియో..
చాలామంది తమ అభిమాన హీరోల పాటలకు డాన్స్ చేయడం మనం చూస్తుంటాం. ఇటీవల అది మరీ ఎక్కువైంది. సోషల్‌మీడియా అందుబాటులోకి వచ్చాక చిన్న పెద్ద అందరూ తమ తమ ట్యాలెంట్‌ను నెట్టింట ప్రదర్శించి మురిసిపోతున్నారు.
తాజాగా ఓ గొర్రెల కాపరి చేసిన డాన్స్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఓ గొర్రెల కాపరి మరో ఇద్దరు బాలురతో కలిసి గొర్రెల మందను తోలుకొని వెళ్తున్నారు. ఈ క్రమంలో గొర్రెల మంద వెనుక వస్తుండగా వాటిముందు వీరు అద్భుతంగా డాన్స్‌చేసారు. మరో బాలుడు గాడిదపై కూర్చుని వీరి డాన్స్‌కు మ్యూజిక్ అందిస్తున్నట్టుగా వేణువు వాయిస్తున్నట్టు నటించాడు. వెనుక గొర్రెలు కూడా వాళ్ల స్టెప్పులకు అనుగుణంగా తలలు ఊపుకుంటూ వారిని అనుసరించాయి.ఇంతకీ ఈ గొర్రెల కాపరులు బాలీవుడ్ హీరో గోవింద పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. దుల్‌హే రాజా టైటిల్ ట్రాక్‌కు అతను అచ్చం గోవింద లాగానే డ్యాన్స్ చేశాడు. పక్కన ఉన్న పిల్లాడు కూడా అతడిని అనుకరించాడు. సినిమాలో దుల్‌హే రాజా పాటకు గోవింద, రవీనా ఠాండన్ డాన్స్ చేస్తారు. ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు. వీడియో చూసిన కొందరు బ్యాకప్ డాన్సర్ల కంటే ఈ గొర్రెల మంద చాలా బెటర్ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..